లండన్
విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత రెండేళ్లుగా అలుపు లేకుండా ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువభేరి సదస్సులు నిర్వహిస్తూ ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇటీవలే కొద్ది విరామం తీసుకుని కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆయన అక్కడ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 16వ తేదీ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా బయల్దేరి ఇంగ్లండ్ వెళ్లిన ఆయన.. మొత్తం 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారని ఇంతకుముందు పార్టీ వర్గాలు తెలిపాయి.