
సాధారణంగా హీరో హీరోయిన్లకు సమ్మర్ వెకేషన్‌గా మారుతుంది. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు మన అందాల భామలు వానాకాలంలో ఫారిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అగ్రనటి నయనతార పెళ్లికి ముందు తన ప్రేమికుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి తరచూ విదేశాలను చుట్టి వచ్చే వారు. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్, పూజా హెగ్డే వంటి వాళ్లు విదేశాల్లో విహారయాత్ర చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు.
ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే టాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ చేస్తున్న టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది. ఈ అమ్మడు ఇటీవల తెలుగులో నటించిన రాధేశ్యామ్ చిత్రం నిరాశపరిచినా తగ్గేదేలే అంటూ అవకాశాలను దక్కించుకుంటోంది. 2010లో మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అయిన ఈ ఉత్తరాది భామ మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీలో సెకండ్ రన్నర్‌గా నిలిచింది. ఆ తరువాత 2012లో ముఖముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. అలా నటిగా దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ బ్యూటీ తాజాగా సినిమాలకు గ్యాప్ రావడంతో నెల రోజుల పాటు విహారయాత్రకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే తొలుత థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి బ్యాంకాక్ లోని సుందరమైన ప్రదేశాలు చుట్టి వచ్చింది. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఆపై అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎంటర్ అయి తన సోదరి, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం మాన్‌హట్టాన్ దీవుల్లో సందడి చేస్తోంది. ఆ గ్లామరస్ ఫొటోలను చూస్తూ యమా ఖుషి అవుతున్న నెటిజన్లు మేడం సార్.. మేడం అంతే అంటూ కామెంట్స్ స్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment