
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమణా స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ తొలి అధికారిక విదేశీ పర్యటన ఖరారు అయింది. ఆయన జూన్ 7-8 తేదీల్లో దక్షిణాసియా దేశం మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. కాగా జూన్ తొలివారంలో భారత ప్రధాని మాల్దీవుల రాజధాని మాలే రానున్నారని ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. 2014లో తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ భూటాన్‌లో పర్యటించారు. ఇప్పుడు ఆయన మాల్దీవులు వెళ్తున్నారు. 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment