టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా? | positive growth in both domestic and foreign tourist visits | Sakshi
Sakshi News home page

టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా?

Published Thu, Jun 30 2016 5:31 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా? - Sakshi

టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా?

దేశంలో పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. 2014లో 128.82 కోట్లమంది దేశీయ పర్యాటకులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించగా.. 11.63శాతం వృద్ధితో 2015లో వారిసంఖ్య 143.2 కోట్లకు చేరింది. 2015లో దేశీయ, విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను తాజాగా కేంద్ర పర్యాటక శాఖకు చెందిన మార్కెట్‌ రీసెర్చ్ డివిజన్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం అత్యధికమంది దేశీయ ప్రర్యాటకులు సందర్శించిన టాప్‌ టెన్‌ రాష్ట్రాలు ఇవే

క్రమసంఖ్య రాష్ట్రాలు సందర్శించిన పర్యాటకులు
1 తమిళనాడు 33.35 కోట్లమంది
2 ఉత్తరప్రదేశ్ 20.49 కోట్లమంది
3 ఆంధ్రప్రదేశ్ 12.16 కోట్లమంది
4 కర్ణాటక 11.99 కోట్లమంది
5 మహారాష్ట్ర 10.34 కోట్లమంది
6 తెలంగాణ 9.45 కోట్లమంది
7 మధ్యప్రదేశ్ 7.8 కోట్లమంది
8  పశ్చిమ బెంగాల్‌  7.02 కోట్లమంది
9 గుజరాత్ 3.63 కోట్లమంది
10 రాజస్థాన్  3.52 కోట్లమంది




2015లో దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు టాప్ టెన్ రాష్ట్రాల వాటా 83.62శాతం ఉండటం గమనార్హం. 2015లో అత్యధిక దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో నిలువగా రెండోస్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. టాప్ టెన్‌లో తెలంగాణ ఆరోస్థానంలో నిలువగా.. గుజరాత్ మంచి వృద్ధిని సాధిస్తూ గతం కన్నా ఒక ర్యాంకుపైకి ఎగబాకి తొమ్మిదో స్థానాన్ని సాధించింది. దీంతో తొమ్మిదో స్థానంలోని మధ్యప్రదేశ్ పదో స్థానానికి పడిపోగా.. గత ఏడాది టాప్‌ టెన్‌లో ఉన్న జార్ఖండ్‌ 11 స్థానానికి పరిమితమైంది.


ఇక విదేశీ పర్యాటకుల విషయానికొస్తే..
2015లో 2.33 కోట్లమంది విదేశీయులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించారు. 2014లో పర్యటించిన 2.23 కోట్లమందితో పోల్చుకుంటే 4.4శాతం వృద్ధి నమైదైంది. 2015లో అత్యధికంగా 46.8 లక్షలమంది విదేశీయులు తమిళనాడును సందర్శించగా.. ఆ తర్వాతి స్థానంలో 44.1 లక్షలమందితో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. విదేశీ పర్యాటకుల విషయలో టాప్‌ టెన్ జాబితాలో తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్ (31 లక్షలు), ఢిల్లీ (23లక్షలు), పశ్చిమ బెంగాల్ (14లక్షలు), రాజస్థాన్ (14లక్షలు), కేరళ (9.8లక్షలు), బిహార్ (9.2 లక్షలు)‌, కర్ణాటక (6.4 లక్షలు), గోవా (5.4లక్షలు) ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement