Domestic tourists
-
ఈఫిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు
ముంబై: ఇకపై ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్‌ను సందర్శించాలనుకునే దేశీ పర్యాటకులు భారత్‌లో రూపొందిన యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) ద్వారా చెల్లించి, ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఫ్రాన్స్‌కి చెందిన ఈ–కామర్స్ దిగ్గజం లైరాతో ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ (ఎన్ఐపీఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భారత టూరిస్టులు యూపీఐ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆన్లైన్లో ఈఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎన్ఐపీఎల్ తెలిపింది. -
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్‌ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్‌ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి. 2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు. కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది. -
పర్యటనకు ఛలో హైదరాబాద్
ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మరిన్ని వివరాలు... ► హైదరాబాద్‌తో పాటు పుణే, జైపూర్, కోచి, మైసూర్ ప్రాంతాలను కూడా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు. ► భారత పర్యాటకులు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ సందర్శన నగరాలుగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, లండన్లు నిలిచాయి. ► దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలుగా షిల్లాంగ్, మంగళూరు, రిషికేశ్, గౌహతి, పుణేలు నిలిచాయి. ► ఈ ఏడాది భారత్‌కు అత్యధికంగా ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పోలండ్, జపాన్, సింగపూర్ల నుంచి పర్యాటకులు వచ్చారు. -
టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా?
దేశంలో పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. 2014లో 128.82 కోట్లమంది దేశీయ పర్యాటకులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించగా.. 11.63శాతం వృద్ధితో 2015లో వారిసంఖ్య 143.2 కోట్లకు చేరింది. 2015లో దేశీయ, విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను తాజాగా కేంద్ర పర్యాటక శాఖకు చెందిన మార్కెట్ రీసెర్చ్ డివిజన్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం అత్యధికమంది దేశీయ ప్రర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ రాష్ట్రాలు ఇవే క్రమసంఖ్య రాష్ట్రాలు సందర్శించిన పర్యాటకులు 1 తమిళనాడు 33.35 కోట్లమంది 2 ఉత్తరప్రదేశ్ 20.49 కోట్లమంది 3 ఆంధ్రప్రదేశ్ 12.16 కోట్లమంది 4 కర్ణాటక 11.99 కోట్లమంది 5 మహారాష్ట్ర 10.34 కోట్లమంది 6 తెలంగాణ 9.45 కోట్లమంది 7 మధ్యప్రదేశ్ 7.8 కోట్లమంది 8 పశ్చిమ బెంగాల్ 7.02 కోట్లమంది 9 గుజరాత్ 3.63 కోట్లమంది 10 రాజస్థాన్ 3.52 కోట్లమంది 2015లో దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు టాప్ టెన్ రాష్ట్రాల వాటా 83.62శాతం ఉండటం గమనార్హం. 2015లో అత్యధిక దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో నిలువగా రెండోస్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. టాప్ టెన్‌లో తెలంగాణ ఆరోస్థానంలో నిలువగా.. గుజరాత్ మంచి వృద్ధిని సాధిస్తూ గతం కన్నా ఒక ర్యాంకుపైకి ఎగబాకి తొమ్మిదో స్థానాన్ని సాధించింది. దీంతో తొమ్మిదో స్థానంలోని మధ్యప్రదేశ్ పదో స్థానానికి పడిపోగా.. గత ఏడాది టాప్ టెన్‌లో ఉన్న జార్ఖండ్ 11 స్థానానికి పరిమితమైంది. ఇక విదేశీ పర్యాటకుల విషయానికొస్తే.. 2015లో 2.33 కోట్లమంది విదేశీయులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించారు. 2014లో పర్యటించిన 2.23 కోట్లమందితో పోల్చుకుంటే 4.4శాతం వృద్ధి నమైదైంది. 2015లో అత్యధికంగా 46.8 లక్షలమంది విదేశీయులు తమిళనాడును సందర్శించగా.. ఆ తర్వాతి స్థానంలో 44.1 లక్షలమందితో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. విదేశీ పర్యాటకుల విషయలో టాప్ టెన్ జాబితాలో తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్ (31 లక్షలు), ఢిల్లీ (23లక్షలు), పశ్చిమ బెంగాల్ (14లక్షలు), రాజస్థాన్ (14లక్షలు), కేరళ (9.8లక్షలు), బిహార్ (9.2 లక్షలు), కర్ణాటక (6.4 లక్షలు), గోవా (5.4లక్షలు) ఉన్నాయి. -
నదుల స్వగత కథనం
నడకే నాట్యం గమనం స్వదేశీ యాత్రికులు పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ విదేశీ యాత్రికులు నా తీరాన విస్తృతంగా పర్యటించారు. గ్రీకు యాత్రికుడు టాలమీ, చైనా యాత్రికుడు హ్యూయాన్త్సాంగ్లు నా తీరాన్ని ప్రపంచానికి తెలియచేశారు. స్వాతంత్య్రపోరాటంలో గాంధీజీ వచ్చి గిరిపుత్రులను స్వాతంత్య్రోద్యమబాట పట్టించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ వచ్చి లండుంగ్రీ- చందిలిడుంగ్రీ కొండల మధ్య హీరాకుడ్ ఆనకట్ట కట్టి జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట అంటూ పిల్లలు పాఠం నేర్చుకుంటూంటే విని మురిసిపోతుంటాను. నా మీద చిన్న పెద్దా కలిసి ముప్పైకి పైగా పవర్ ప్లాంటులున్నాయి. హీరాకుడ్తోపాటు రవిశంకర్సాగర్, దూధ్వా, సోందూర్ రిజర్వాయర్లు, హాస్దేవ్ వంటి ప్రధాన ప్రాజెక్టులతోపాటు చిన్న పెద్ద ఆనకట్టలు నా నీటిని ప్రజోపకరంగా మారుస్తున్నాయి. చత్తీస్‌ఘడ్‌లో పుట్టి తూర్పు కనుమల గుండా ప్రవహిస్తూ ఒడిషాలో అడుగుపెట్టి బంగాళాఖాతంలో కలిసే మధ్యలో సియోనాథ్, జోంక్, హాస్దేవ్, మాండ్, ఇబ్, ఓంగ్, తేల్ నదులు నాతో జతకడతాయి. ఇన్నేసి నదులు నా స్నేహం కోసం వచ్చాయని సంతోషపడుతూ పరుగులు తీస్తుంటాను. కనుచూపు మేరలో కటక్ ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. ఇంతలో నా ప్రవాహం నుంచి ఒక పెద్ద పాయ చీలిపోతుంది. కట్జోరి పేరుతో కొత్త పేరు పెట్టుకుని ఆ పాయ తన ఉనికిని చాటుకునే లోపు నీరు పల్లమెరుగు అనే నానుడిని రుజువు చేస్తూ ఆ ప్రవాహం కాస్తా మరో ఐదు పాయలుగా చీలిపోతుంది. అవి పైకా, బిరుప, చిత్రోక్తల, గెంగుటీ, లున్ పేర్లతో సాగరం వైపు పరుగులు తీస్తుంటాయి. నేను పారాదీప్‌కు సమీపంలో జగత్సింగ్పూర్ దగ్గర సాగరంలో కలిసిపోతాను. నా ప్రవాహం ఎంత విశాలంగా ఉండేదంటే... బంగాళాఖాతం నుంచి నౌకలు దాదాపుగా 150 కిలోమీటర్ల లోపలికి వచ్చేవి. హీరాకుడ్... నీటికి ఆనకట్టతోపాటు నౌకలకు అడ్డుకట్ట అయింది. ప్రాచీనకాలంలో సంబల్పూర్ వర్తకవాణిజ్య కేంద్రం కావడానికి కారణం నా ప్రవాహమే. తూర్పు కనుమల మధ్య దారి వెతుక్కుంటూ మెలికలు తిరుగుతూ నెమ్మదిగా ప్రవహించే నేను సత్కోసియా దగ్గర కొండలను ఒరుసుకుంటూ నేలకు ఉరుకుతాను. నన్ను కళ్లారా చూడడానికే ఆనకట్ట డెక్ మీద 21 కి.మీల దూరం ప్రయాణించే పర్యాటకులను చూడడం నాకు అద్భుతమైన అనుభూతి. మన సాంకేతిక పురోగమనానికి నిదర్శనంగా ఆనకట్టకు ఉత్తరాన గాంధీ మినార్, దక్షిణాన నెహ్రూ మినార్లుంటాయి. హిండాల్కో హీరాకుడ్ స్మెల్టర్, హిండాల్కో హీరాకుడ్ పవర్, సామలేశ్వరి స్పాంజ్ ఐరన్ లిమిటెడ్, టి.ఆర్. కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ పరిశ్రమలకు నేనే పెద్ద ఆసరా. గిరిపుత్రుల సామూహిక వేడుకలు... సంబల్పూర్లో అడుగుపెడుతుంటే ప్రకృతిని ప్రేమించే గిరిజనుల ఆహార్యం గుర్తొచ్చి మనసు పులకిస్తుంది. గోండు, భుయాన్ గిరిపుత్రులు ఏడాదిలో ప్రతి దశనూ వేడుక చేసుకుంటారు.ఎర్రటి, పసుపువర్ణం వస్త్రాలు ధరించి జుట్టును కొప్పు పెట్టి పూలు చుట్టుకుని అచ్చమైన అడవి మల్లెల్లాంటి యువతులు అర్ధ వలయాకారంగా నిలబడి సంగీతానికి, సాహిత్యానికి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదుపుతూ చేసే ‘దాల్ఖాయ్’ నృత్యం, పిల్లల కోసం చేసే ‘కర్మా’ నృత్యం, రాధాకృష్ణుల ప్రేమ ఇతివృత్తంతో యువతీయువకులు చేసే ‘కోయిసాబాదీ’ నృత్యం కనువిందు చేస్తాయి. బౌద్ధ పరిమళాలు... నా తీరం చారిత్రక కట్టడాలు, పచ్చటి కొండలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల సుమహారం. హ్యూయాన్‌త్సాంగ్ ఇక్కడ అంగుళం అంగుళాన్ని పరికించి గ్రంథస్థం చేస్తుంటే చూసి పొంగిపోయాను. బౌధ్‌లో అడుగుపెట్టగానే మధ్యయుగం నాటి బౌద్ధ విగ్రహాలు కళ్ల ముందు మెదలుతాయి. చౌహాన్ పాలకులు కట్టించిన పటానేశ్వరి ఆలయం, సామలేశ్వరి గుడి, బారా జగన్నాథ ఆలయాలు పర్యాటకులతో కళకళలాడుతూంటాయి. వీటన్నింటికంటే ఆసక్తికరమైనది బిమలేశ్వర్ ఆలయం. హుమా ఆలయంగా పిలిచే ఈ కట్టడం కొద్దిగా ఒరిగి ఉంటుంది. ఒరిగి నిలబడడం ఓ ప్రపంచ వింత అయితే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పిసా’లాగ బిమలేశ్వర్ ఆలయమూ ఓ వింతే. ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి email: manjula.features@sakshi.com మహానది ప్రవాహ దూరం: 858 కి.మీ.లు పుట్టింది: చత్తీస్‌ఘర్ కొండల్లో సాగరసంగమం: బంగాళాఖాతంలో ఒరిస్సా రాష్ట్రంలోని పారాదీప్ దగ్గర