
ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మరిన్ని వివరాలు...
► హైదరాబాద్‌తో పాటు పుణే, జైపూర్, కోచి, మైసూర్ ప్రాంతాలను కూడా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు.
► భారత పర్యాటకులు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ సందర్శన నగరాలుగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, లండన్‌లు నిలిచాయి.
► దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలుగా షిల్లాంగ్, మంగళూరు, రిషికేశ్, గౌహతి, పుణేలు నిలిచాయి.
► ఈ ఏడాది భారత్‌కు అత్యధికంగా ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పోలండ్, జపాన్, సింగపూర్‌ల నుంచి పర్యాటకులు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment