preferred
-
పర్యటనకు ఛలో హైదరాబాద్
ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్ సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్ ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. మరిన్ని వివరాలు... ► హైదరాబాద్‌తో పాటు పుణే, జైపూర్, కోచి, మైసూర్ ప్రాంతాలను కూడా దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించారు. ► భారత పర్యాటకులు ప్రాధాన్యత ఇచ్చిన అంతర్జాతీయ సందర్శన నగరాలుగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, లండన్లు నిలిచాయి. ► దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతాలుగా షిల్లాంగ్, మంగళూరు, రిషికేశ్, గౌహతి, పుణేలు నిలిచాయి. ► ఈ ఏడాది భారత్‌కు అత్యధికంగా ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, పోలండ్, జపాన్, సింగపూర్ల నుంచి పర్యాటకులు వచ్చారు. -
భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న స్మార్ట్‌ఫోన్
ముంబై : స్మార్ట్ఫోన్ల యుగంలో రోజుకోక కొత్త ఫీచర్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పోటీని తట్టుకునేందుకు ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో నెలకొక స్టార్మ్‌ఫోన్‌ని లాంచ్ చేస్తోంది. వీటిలో కొన్ని హై బడ్జెట్ ఫోన్లు కాగా మరి కొన్ని మాత్రం సామాన్యులకు అందుబాటులో ఎక్కువ ఫీచర్స్‌తో.. తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్‌ఫోన్‌కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి. మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్ లెన్స్’ నిర్వహించిన సర్వేలో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్ ప్రిఫరబుల్ బ్రాండ్‌గా నిలిచింది. తరువాతి వరుసలో శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్ఫోన్లున్నాయి. ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే స్మార్ట్ఫోన్లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌తోనే అడ్జస్ట్ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది. అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్‌ప్లస్ బ్రాండ్‌ను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలిసింది. ఒప్పో, వివో, ఆపిల్, హనర్ వంటి హై బడ్జెట్ బ్రాండెడ్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్‌ప్లస్ ముందు వరుసలో ఉంది. -
వరి సాగు వైపే మొగ్గు
-బోర్లు, బావుల ఆధారంగా సాగు -ఆశాజనకంగా లేని భూగర్భజలాలు -సాగర్ ప్రాజెక్ట్ నిండితేనే ఆయకట్టుకు నీరు -వేచి చూడాలంటున్న అధికారులు -తప్పనిసరి పరిస్థితుల్లో వరి సాగు హుజూర్నగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పరిధిలోని ఆయకట్టులో గల నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో పలువురు రైతులు ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. బోర్లు, బావుల ఆధారంగా కొంతమేర నీటి ల భ్యత కలిగిన రైతులు కో టి ఆశలతో సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన తొలకరి వర్షాలకు రైతులు తమ బీడు భూము ల్లో సేంద్రియ ఎరువుల విత్తనాలైన జీలుగ, పెసర సాగు చేపట్టారు. అంతేగాక బీడు భూముల ను దున్నడంతో పాటు వరి పెంచుతున్నారు. నిరాశాజనకంగా భూగర్భజలాలు ప్రస్తుతం బోర్లు, బావుల్లో ఆశించిన మేర భూగర్భజలాలు లేకపోవడంతో నారుమళ్లకు మాత్రమే సదరు నీరు సరిపోతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తరుచుగా వర్షాలు పడుతున్నందున చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు భూ గర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావంతో సాగు పనుల్లో నిమగ్నమయ్యూరు. గత రబీ సీజన్లో కూడా బోర్లు, బావుల ఆధారంగా సాగు చేపట్టిన రైతులు అడుగంటిన భూగర్భ జలాలతో వరిపొలాలకు సాగు నీరందక ఎండిపోవడంతో తీవ్ర నష్టాలపాలయ్యూరు. అయినప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు అనేక ఆశలతో ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికే సుమారు 20 వేల ఎకరాలకు పైగా రైతులు వరినార్లు పోసి పెంచుతూ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగర్ నిండితేనే సాగునీరు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 503 అడుగుల అడుగంటిన నీరు ఉండటం, ఆ పైన గల శ్రీ శైలం, జూరాల, నారాయణపూర్ ప్రాజెక్ట్‌లకు కూడా నేటి వరకూ నీరు చేరకపోవడంతో అవి అడుగంటారుు. ఈ ప్రాజెక్ట్‌లన్నీ నిండి చివరగా ఉన్న సాగర్ ప్రాజెక్ట్‌లోకి నీరు చేరితేనే ఆయకట్టుకు సాగునీరందే అవకాశం ఉంది. సాగునీరు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో సైతం రైతులు వరి సాగు చేపడుతుండడం చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లానేతలకు తగిన ప్రాధాన్యం లభించింది. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి అనుమతి మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా నాయకులకు కీలక పదవులు లభించాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం బాబు, గున్నం నాగిరెడ్డిలను నియమించారు. అదేవిధంగా పార్టీ కార్యదర్శిగా ఆలేరు నియోజకవర్గానికి చెందిన వడ్లోజు వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా గూడూరు జైపాల్‌రెడ్డి (భువనగిరి), ఇరుగు సునీల్ కుమార్ (నల్లగొండ)లను నియమిం చారు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినా, తదుపరి అధ్యక్ష నియామకం జరిగేంతవరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, గున్నం నాగిరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయకర్త బాధ్యతలను కూడా అప్పగించారు. మొత్తం మీద జిల్లా నాయకులకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు లభించడం పట్ల జిల్లా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
భేష్... బెస్ట్ పేరెంట్స్!
కొత్త విషయం నియాండర్తాల్ మానవజాతి గురించి మనం అర్థం చేసుకోవాల్సినంత స్థాయిలో అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. యాభై వేల ఏళ్ల క్రితమే నియాండర్తాల్స్, శవాలను సమాధి చేసే వారనే విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఆశ్చర్యాల జాబితాలో ఇప్పుడు సరికొత్తది ఒకటి చేరింది. నియాండర్తాల్స్ అనగానే మొరటు వాళ్లు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇవ్వని వాళ్లు అనే అభిప్రాయం ఉంది. కొత్త పరిశోధన ఒకటి ఆ అభిప్రాయం తప్పని చెబుతోంది. నియాండర్తాల్స్కు పిల్లల పెంపకంలో మంచి నైపుణ్యం ఉండేది. పిల్లలను అన్ని విధాల జాగ్రత్తగా చూసుకునేవాళ్లు. పిల్లలలో వివిధ రకాల నైపుణ్యాలను వృద్ధి చేయడానికి రకరకాల ఆటలు ఆడించేవారు. ఇక పిల్లల విషయానికి వస్తే... కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా సమాజంలో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించేవారట! నియాండర్తాల్స్ బాల్యం సంక్లిష్టంగా ఉండేదనీ, ప్రమాదకరంగా, కష్టాలతో కూడుకొని ఉండేదనీ చాలాకాలంగా నెలకొన్న అభిప్రాయాన్ని యూనివర్సిటీ ఆఫ్ యార్క్(కెనడా)కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు సవాలు చేశారు. పిల్లలకు వారి తల్లిదండ్రులతో, చుట్టూ ఉన్న సమాజంతో బలమైన భావోద్వేగ బంధాలు ఉండేవని చెబుతున్నారు. జబ్బు పడిన , గాయపడిన పిల్లలను నెలల తరబడి కంటికి రెప్పలా చూసుకునేవారట. ఒకవేళ పిల్లలు ఎవరైనా చనిపోతే... వారి అంత్యక్రియలను ప్రత్యేకంగా నిర్వహించేవారట. నియాండర్తాల్స్కు... పిల్లలను పెంచడం అనేది సం క్లిష్టంగా ఉండేదనే అభిప్రాయాన్ని పరిశోధన బృందానికి నాయకుడైన డా.పెన్నీ స్కిపిన్స్ ఖండించారు. కేవలం జీవసంబంధమైన సాక్ష్యాధారాలపై మాత్రమే ఆధారపడకుండా నెదర్లాండ్స్ సమాధులలో నుంచి వెలికి తీసిన సాంఘిక, సాంస్కృతిక సాక్ష్యాలను లోతుగా అధ్యయనం చేశారు.