సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లానేతలకు తగిన ప్రాధాన్యం లభించింది. పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో జిల్లా నాయకులకు కీలక పదవులు లభించాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం బాబు, గున్నం నాగిరెడ్డిలను నియమించారు.
అదేవిధంగా పార్టీ కార్యదర్శిగా ఆలేరు నియోజకవర్గానికి చెందిన వడ్లోజు వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా గూడూరు జైపాల్‌రెడ్డి (భువనగిరి), ఇరుగు సునీల్ కుమార్ (నల్లగొండ)లను నియమిం చారు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్‌రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినా, తదుపరి అధ్యక్ష నియామకం జరిగేంతవరకు ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, గున్నం నాగిరెడ్డిని ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయకర్త బాధ్యతలను కూడా అప్పగించారు. మొత్తం మీద జిల్లా నాయకులకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవులు లభించడం పట్ల జిల్లా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యం
Published Sat, Jan 10 2015 3:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement