ముంబై: ప్రియురాలితో ఫారిన్ టూర్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ఆ విషయం భార్యకు తెలియకుండా చేయాలనే ప్రయత్నంలో చేసిన పొరపాటుతో కటకటాలపాలయ్యాడు. పుణెకి చెందిన సందర్శి యాదవ్(32) ఓ బహుళ జాతి సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసు పని మీద ఫారిన్ వెళ్లున్నట్లు భార్యను నమ్మించి, ప్రియురాలితో కలిసి మాల్దీవులకు చెక్కేశాడు. ఆ సమయంలో భార్యకు వాట్సాప్ ద్వారా మాత్రమే ఫోన్ చేశాడు.
టూర్ విషయం భార్యకు తెలియరాదనే ఉద్దేశంతో పాస్‌పోర్టులోని మాల్దీవుల టూర్ వీసా స్టాంప్ పేజీలను చించేశాడు. గురువారం రాత్రి ముంబైకి వచ్చాక ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అతడి నిర్వాకం బయటపడింది. పాస్‌పోర్టు పత్రాలను చించివేయడం నేరమనే విషయం తనకు తెలీదని ఒప్పుకున్నాడు. ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment