గోడ లోపల ప్రియురాలి కుళ్లిన శవం | Man Assassinated Lover And Kept Body Behind Wall In Maharashtra | Sakshi
Sakshi News home page

గోడ లోపల ప్రియురాలి కుళ్లిన శవం

Published Fri, Jan 15 2021 6:57 PM | Last Updated on Fri, Jan 15 2021 10:04 PM

Man Assassinated Lover And Kept Body Behind Wall In Maharashtra - Sakshi

సంఘటనా స్థలం వద్ద అధికారులు.. నిందితుడు హనీఫ్‌ పాటెల్‌(ఇన్‌సెట్‌లో)

ముంబై : ప్రియురాలిని చంపి ఆమె శవాన్ని గోడలో దాచిపెట్టాడు ఓ కిరాతక ప్రియుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పల్‌ఘర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్‌రోలికి చెందిన అమితా మోహిత్‌ అనే యువతి నాలుగు నెలల క్రితం ప్రియుడు హనీఫ్‌ పాటెల్‌తో కలిసి ఇంటినుంచి పారిపోయింది. ఇద్దరూ పల్‌ఘర్‌ జిల్లాలోని వన్‌గావ్‌ ఏరియా వ్రిందావన్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో దిగారు. అయితే కొద్దిరోజుల తర్వాత గొడవల కారణంగా హనీఫ్‌ ఆమెను చంపేశాడు. ఆమె శవం బయటపడితే జైలుకు వెళ్లవలసి వస్తుందని భావించాడు. ( శిష్యురాలికి ట్రైనింగ్‌.. ఆ వ్యక్తి చనిపోయాడని..)

ఫ్లాట్‌లోనే ఓ గోడ నిర్మించి దాని లోపల ప్రియురాలి శవాన్ని ఉంచాడు. అమితా మోహిత్‌  కుటుంబసభ్యులకు అనుమానం రాకుండా ఆమె వాట్సాప్‌, ఇతర సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ వారికి టచ్‌లో ఉండేవాడు. అయితే దీనిపై అనుమానపడ్డ వారు బోయిసర్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్‌ డేటా ఆధారంగా అతడ్ని పట్టుకున్నారు. గురువారం గోడ లోపల దాచిన అమితా మోహిత్‌ శవాన్ని కుళ్లిన స్థితిలో బయటకు తీశారు. పోలీసుల విచారణలో హనీఫ్‌ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement