20 మార్చి నుంచి 26 మార్చి, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ పరిచినా అవసరాలకు సొమ్ము అందు తుంది. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వాహన యోగం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహకారం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుంచి మాట పడతారు. కష్టం మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాబడి సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటా బయటా అనుకూలస్థితి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తెలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలు విదేశీ పర్యటనలు చేస్తారు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం. సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అన్నింటా మీదే పైచేయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు శుభ వార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. కళారంగం వారికి సన్మానాలు, అవార్డులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు అర్చన చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకూల బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, నేరేడు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యో గులకు కోరుకున్న మార్పులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్య టనలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
వారఫలాలు (20-03-2016 / 26-03-2016)
Published Sun, Mar 20 2016 2:00 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
Advertisement