Industrial sources
-
వారఫలాలు (20-03-2016 / 26-03-2016)
20 మార్చి నుంచి 26 మార్చి, 2016 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ పరిచినా అవసరాలకు సొమ్ము అందు తుంది. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వాహన యోగం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహకారం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుంచి మాట పడతారు. కష్టం మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాబడి సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటా బయటా అనుకూలస్థితి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తెలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలు విదేశీ పర్యటనలు చేస్తారు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం. సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అన్నింటా మీదే పైచేయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు శుభ వార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. కళారంగం వారికి సన్మానాలు, అవార్డులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకూల బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, నేరేడు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యో గులకు కోరుకున్న మార్పులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్య టనలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు మా లక్ష్యం: కేటీఆర్
* నిపుణుల సంఖ్య 10 లక్షలకు పెంచే ప్రయత్నం * ఐటీ, ఎలక్ట్రానిక్స్ వర్గాలు పెట్టుబడులు, పరిశోధనలకు ముందుకు రావాలని పిలుపు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే ఐటీకి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని మారుస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బహుళజాతీయ కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన అత్యుత్తమ విద్యా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులు అందుబాటులో ఉన్నారన్నారు. బెంగళూరులో బుధవారం జరిగిన తెలంగాణ ఐటీ రోడ్ షో కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమ వర్గాలతో సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేం దుకు, పరిశోధనలు చేపట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వర్గాలు ముందుకు రావాలని కోరారు. ఐటీ రంగంలో లక్ష కోట్ల ఎగుమతులే ప్రభుత్వ లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగుల సంఖ్యను 10 లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక్కడి నుంచి బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని వెల్లడిం చారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్, డెల్, మొటోరోలా, డెలాయిట్, కన్వర్జీస్, యూబీఎస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, హనీవెల్, సీమెన్స్, జేపీ మోర్గాన్, యునెటైడ్ హెల్త్ గ్రూపు, ఫేస్ బుక్ తదితర 500 వరకు కంపెనీలు ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటన్నారు. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర, కాగ్నిజెంట్, ఐగేట్, సొనాట, ఇన్ఫోటెక్ తదితర సంస్థలు హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అత్యుత్తమ విద్యా, పరిశోధన రంగాల్లో ఐఎస్బీ, జేఎన్టీయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, డీఆర్డీఓ సంస్థలు విద్యార్థులకు సేవలందిస్తున్నాయన్నారు. ఇతర నగరాల తో పోల్చితే హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలపై వెచ్చించాల్సిన ఖర్చు తక్కువన్నారు. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న హైదరాబాద్‌ని ఇన్నోవేషన్, టెక్నాలజీ, డెవలపింగ్ న్యూ గ్రోత్ సెక్టార్ త్రూ స్మార్ట్ సిటీ ప్లానింగ్ ద్వారా విస్తరిస్తామన్నారు. అందుబాటులోకి రానున్న మెట్రో రైలు, అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం, ఉచిత వైఫై సేవలు తదితరాలన్నింటిని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఆర్థిక అభివృద్ధికి ఐటీ రంగం ఇంజన్‌గా ప్రభుత్వం గుర్తిస్తోందని, దీని అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఐటీ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, రహేజా గ్రూపు చైర్మన్ నీల్ రహేజా తదితరులు పాల్గొన్నారు. -
ఇక దిక్సూచి ఆర్బీఐ నిర్ణయమే
స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా జీడీపీ గణాంకాల ఎఫెక్ట్ ఉంటుంది పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం న్యూఢిల్లీ: సామాన్యుడి దగ్గర్నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షపై స్టాక్ మార్కెట్లు సైతం దృష్టిపెట్టాయి. మంగళవారం(2న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న విధాన సమీక్ష ఇకపై స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక గడిచిన శుక్రవారం(28న) మార్కెట్లు ముగిశాక వెలువడ్డ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. వీటితోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశ విశేషాలు, ఆర్థిక సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రధాన సూచీలు ఈ వారం కొంతమేర ఒడిదుడుకులను చవిచూసే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు ఆటో రంగ అమ్మకాలు వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని అంచనా వేశారు. వడ్డీ కోత అంచనాలు...: గత వారం చివర్లో సరికొత్త గరిష్టాలను చేరిన మార్కెట్లపై 5.3%కు పరిమితమైన జీడీపీ వృద్ధి ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు విశ్లేషించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఆర్థిక వ్యవస్థ 5.7% వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపువైపు దృష్టిపెట్టే అవకాశంలేకపోలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే మార్కెట్లలో కనిపిస్తున్న ప్రస్తుత సానుకూల వాతావరణం కారణంగా ప్రధాన సూచీలు ఈ వారం కూడా కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని చెప్పారు. అంత సులువుకాదు: పార్లమెంట్ సమావేశాలు, పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ నెలకు హెచ్ఎస్బీసీ తయారీ పీఎంఐ డేటా సోమవారం(1న), సర్వీసెస్ డేటా బుధవారం(3న) విడుదలకానున్నాయి. ఇంకా, నవంబర్ వాహన విక్రయాలు సోమవారం వెల్లడికానున్నాయి. -
జీవన నైపుణ్యాలు నేర్పే.. ఫినిషింగ్ స్కూల్స్
‘విద్యార్థులు కష్టపడి చదివి డిగ్రీలు సంపాదిస్తున్నారు కానీ.. జాబ్ మార్కెట్‌కు కావాల్సిన నైపుణ్యాలను పొందలేకపోతున్నారు’.. నేటి విద్యార్థుల తీరుపై పారిశ్రామిక వర్గాలు తరచుగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయమిది. అటు నాస్కామ్, ఫిక్కీ వంటి సంస్థల సర్వేలు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నాయి. విద్యా సంస్థలు విద్యార్థుల కోసం ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తున్నా.. చాలామంది తగిన స్కిల్స్ లేక ఉద్యోగ సాధనలో వెనుకంజలో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి కొలువు సాధించడానికి, కెరీర్లో అత్యుత్తమంగా రాణించడానికి కావాల్సిన జీవన నైపుణ్యాలను నేర్పే ఉద్దేశంతో ఏర్పాటైనవే.. ఫినిషింగ్ స్కూల్స్. నగరంలో ఎన్నో ఫినిషింగ్ స్కూల్స్ వివిధ కోర్సులను అందిస్తున్నాయి. ఆ వివరాలు.. ఫినిషింగ్ స్కూల్ అంటే.. ఫినిషింగ్ స్కూల్స్.. విదేశాల్లో బాగా పాపులర్. ఆయా దేశాల యూనివర్సిటీల్లో కోర్సు పూర్తయ్యేనాటికి.. అటు అకడమిక్ నైపుణ్యాలతోపాటు ఇటు జాబ్ మార్కెట్‌కు తగిన స్కి ల్స్‌ను కూడా విద్యార్థులకు నేర్పిస్తారు. తద్వారా ఉ ద్యోగంలో చేరేనాటికే అన్ని నైపుణ్యాలను విద్యార్థులు పుణికిపుచ్చుకుంటారు. ఈ కోవలోనే మనదేశంలో కూడా ఫినిషింగ్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉన్నాయి. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న రంగాలకు సంబంధించి సర్టిఫికెట్, పీజీ డిప్లొమా కోర్సులను బోధిస్తున్నాయి. వీటి కరిక్యులమ్‌ను పారిశ్రామిక వర్గాల సలహాలు, సూచనల ప్రకారం రూపొందిస్తారు. అంతేకాకుండా క్లాస్ రూం టీచింగ్, ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్‌లకు సమ ప్రాధాన్యమిస్తారు. సమాజ, పరిశ్రమల అవసరాలకనుగుణంగా అభ్యర్థిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. కోర్సుల్లో అంశాలివే బ్యాచిలర్స్ డిగ్రీ మూడో ఏడాదిలో చివరి మూడు నెలలు ఫినిషింగ్ స్కూల్ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా.. సోషల్ స్కిల్స్, కల్చరల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, సాఫ్ట్ సిల్క్స్ వంటివి నేర్పిస్తారు. వేషధారణ (డ్రెస్సింగ్), బాడీలాంగ్వేజ్ (శరీర భాష), ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత ప్రవర్తన, మానవ సంబంధాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి, భోజన మర్యాదలు, పార్టీల్లో, ఫంక్షన్స్‌లో వ్యవహరించాల్సిన పద్ధతులు, విదేశీ క్లయింట్స్‌తో వ్యవహరించగల నేర్పు.. ఇలా సందర్భానికి తగినట్లుగా ఆయా నైపుణ్యాలు పొందేలా ఫినిషింగ్ స్కూల్స్‌లో బోధన ఉంటుంది. ఇందుకోసం సైకాలజీ, మేనేజ్మెంట్, హెల్త్, బ్యూటీ, ఫుడ్ అండ్ డైట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి అంశాల్లో నిపుణులైనవారితో తరగతులు నిర్వహిస్తారు. పురుషులు, మహిళలకు వేర్వేరు ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణి ంచాలంటే ఇదే ప్రధాన సూత్రం. ఫినిషింగ్ స్కూల్ కరిక్యులంలో అబ్బాయిలు, అమ్మాయిలకు శిక్షణాంశాలు వేర్వేరుగా ఉంటాయి. నగరంలోని పలు మహిళా కళాశాలల్లో అందిస్తున్న అంశాలివి.. పోషకాలున్న ఆహారాన్ని తయారుచేయడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం వంటి మహిళలకు అవసరమైన అంశాలతోపాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ-బ్యాంకింగ్, ఈ-కామర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివాటిని మహిళలకు నేర్పిస్తారు. వీటితోపాటు మైక్రోవేవింగ్, వెజిటెబుల్ కార్వింగ్, పర్సనల్ గ్రూమింగ్, ఏరోబిక్స్, యోగా తదితర అంశాలు కూడా ఉంటాయి. పురుషులకు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో రాణించేందుకు వీలుగా భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు, సమయపాలన, ప్రజెంటేషన్ స్కిల్స్, టేబుల్ మేనర్స్ వంటి వాటిలో శిక్షణనిస్తారు. కెరీర్లో మరింత రాణింపు ‘గ్రాడ్యుయేషన్ చివర్లో క్యాంపస్‌లోనే ప్లేస్మెంట్ సాధించి కెరీర్లో స్థిరపడాలనేది ఇప్పటి యువతరం ఆలోచన. దీనికి తగినట్లుగా అవసరమైన నైపుణ్యాలను రూపొందించేందుకే ఫినిషింగ్ స్కూల్స్ అంటున్నారు విల్లామేరి కళాశాల అకడమిక్ ఇన్‌ఛార్జి రేవతిదేవి మాధుర్. జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు కేవలం అకడమిక్స్ అర్హతలు సరిపోవట్లేదని, అదనపు నైపుణ్యాలు ఉంటేనే కంపెనీలు ఉద్యోగాలిస్తాయని ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా యువతులకు గృహాలంకరణ.. అందం, ఆరోగ్య సం బంధిత అంశాలపై నేర్చుకునే అంశాలు భావి జీవితంలో ఉపకరిస్తాయనేది ఆమె మాట. అంతేకాకుండా ప్రాక్టికల్‌గా ఎదురయ్యే సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు ఇక్కడ నేర్చుకున్న ప్రొఫెషనల్ అంశాలు కెరీర్లో ఎదిగేందుకు తోడ్పడతాయని అంటున్నారు. ‘ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థినులకు ఈ తరహా శిక్షణ ఉపయోగకరం గా ఉంటుంది. దీన్ని మా క్యాంపస్‌లోనూ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం’ అని అంటున్నారు వనితా మహావిద్యాలయ ప్రిన్సిపల్ డాక్టర్ బి.వాణి. కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్స్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ వంటి కోర్సులను దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కళాశాలలు అందిస్తున్నాయి. అయితే ఎక్కువగా వ్యాల్యూ యాడెడ్ కోర్సులుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. నగరంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాలలు, మేనేజ్మెంట్ కళాశాలలు.. అకడమిక్ కోర్సులతోపాటే వీటిలో శిక్షణ ఇస్తున్నాయి. తద్వారా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పొందడానికి మార్గం సుగమం చేస్తున్నాయి. ఆల్‌రౌండ్ ప్రతిభకు కేరాఫ్ ఫినిషింగ్ స్కూల్స్ ‘‘నేడు వ్యక్తిగత, వృత్తిగత జీవితాల్లో రాణించాలంటే దానికి ఏకైక మార్గం.. ఫినిషింగ్ స్కూల్స్. శిక్షణ ద్వారా జీవన నైపుణ్యాలను అలవర్చుకుంటే కెరీర్లో మరింత ఉన్నతస్థానానికి చేరొచ్చు. డ్రెస్సింగ్, టైం మేనేజ్మెంట్, ఆటిట్యూడ్, ఆప్టిట్యూడ్, పర్సనల్ బిహేవియర్ ఇలా.. ప్రతిదీ జీవితంతో ముడిపడినదే. కాబట్టి లైఫ్ స్కిల్స్‌ను ప్రతి ఒక్కరూ పొందాలి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్కృతి భాగ్యనగరంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కోర్సులు చేసేందుకు యువత ఆసక్తి చూపుతోంది’’ - కవిత, డెరైక్టర్, పనాచే ఫినిషింగ్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ (దూరవిద్యా విధానంలో) వెబ్సైట్: www.oucde.org రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ - శ్రీపెరంబదూర్ కోర్సు: ఎంఏ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అర్హత: 45 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.. వెబ్సైట్: www.rgniyd.gov.in రామకృష్ణ మఠం - హైదరాబాద్, వెబ్సైట్: www.rkmath.org ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - రూర్కీ వెబ్సైట్:www.iitr.ac.in యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in -
పీసీబీ సర్క్యులర్ల అమలు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పారిశ్రామిక వర్గాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధికి వారి ప్రాజెక్టు వ్యయంలో ఒక శాతం మొత్తాన్ని కేటాయించాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) జారీ చేసిన సర్క్యులర్లను హైకోర్టు బుధవారం నిలుపుదల చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వెనుకబడిన తరగతుల సంక్షేమం, మహిళా సాధికారిత కోసం ఏర్పాటు చేసిన సీఎస్ఆర్ నిధికి ప్రాజెక్టు వ్యయంలో కనీసం ఒక శాతం మొత్తాన్ని, తర్వాత పదేళ్లపాటు 0.2 శాతం మొత్తాన్ని రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలు కేటాయించాలంటూ 2012లో పీసీబీ సర్క్యులర్లు జారీచేసింది. ఈ సర్కులర్ల అమలు బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. ఇందులో భాగంగా ఇటీవల కొన్ని జిల్లాల కలెక్టర్లు పలు పరిశ్రమలకు నోటీసులు జారీ సీఎస్ఆర్ నిధికి డబ్బు జమ చేయాలని ఆదేశించారు. ఇలా నోటీసులు అందుకున్న మెదక్ జిల్లాలోని థర్మల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయిం చింది. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరఫున చల్లా గుణరంజన్ వాదనలు వినిపిస్తూ.. ఇటువంటి నోటీసులు జారీ చేసే పరిధి పీసీబీకి లేదన్నారు. పీసీబీ జారీ చేసిన సర్క్యులర్ల వల్ల పరిశ్రమలపై భారం పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పీసీబీ సర్క్యులర్ల అమలు ను నిలిపివేస్తూ పై ఉత్తర్వులు జారీ చేసింది.