న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీతో పాటు ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల పేర్లను వెల్లడించాలని విదేశీ వ్యవహారాల శాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. 2015–16, 2016–17 వార్షిక సంవత్సరాల్లో మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులు, మోదీతో ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల వివరాలను ఇవ్వాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు కరాబీ దాస్ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
శాఖ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఇవ్వాలంటే రూ.224 చెల్లించాలని ఆ శాఖ డిమాండ్ చేసిందని, ఆ విధంగానే కరాబీ చెల్లించాడని అయితే ప్రధాని విదేశీ పర్యటనల తేదీలు, దేశాల వివరాలు, చార్టర్డ్ విమానాలకయ్యే ఖర్చుల వివరాలు తప్ప మరేమీ ఇవ్వలేదని కరాబీ తరఫున ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కేంద్ర సమాచార కమిషనర్ ఆర్‌కే మాథూర్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment