మీడియాకు థ్యాంక్స్‌ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే? | Kerala CM's Foreign Trip: Governor Khan Thanks For Media | Sakshi
Sakshi News home page

మీడియాకు థ్యాంక్స్‌ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?

May 11 2024 6:01 PM | Updated on May 11 2024 6:10 PM

Kerala CM's Foreign Trip: Governor Khan Thanks For Media

కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూడు వారాల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సీఎం పర్యటన గురించి తనకు తెలియజేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సీఎం పినరయి విజయన్.. ఆయన కుటుంబసభ్యుల విదేశీ పర్యటనపై గవర్నర్ స్పందన ఏంటని అడిగినప్పుడు నాకు తెలియదు, తెలియజేసినందుకు మీడియాకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పర్యటల గురించి తనకు గతం నుంచి వెల్లడించడం లేదని రాష్ట్రపతికి ఇదివరకే లేఖ రాశానని ఖాన్ చెప్పారు. అయితే పినరయి విజయన్ పర్యటన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.

సీఎం.. ఆయన కుటుంబసభ్యులు మే 6న విదేశాలకు వెళ్లారు. కేరళలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత విజయన్ విరామం తీసుకోవాలనున్నారు. అందుకే తన కుటుంబంతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement