విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
Published Thu, Feb 16 2017 10:44 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM
న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు. తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు.
ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది. 24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్‍్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్‍్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది.
Advertisement
Advertisement