free SIM cards
-
విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు. తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది. 24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది. -
న్యూ ఇయర్‌కి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం బంపర్ బహుమతిని తీసుకొస్తుంది. అది స్వదేశీయులకు కాదండోయ్ విదేశీయులకు. విదేశాల నుంచి భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇక నుంచి సిమ్ కార్డులు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం కానుకగా వారికి వీటిని అందించనుంది. మొత్తం పన్నెండు విమానాశ్రయాల్లో దాదాపు 161 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ సిమ్ కార్డులను ఇవ్వనుంది. పంజిమ్, అహ్మదాబాద్, అమృత్ సర్, జైపూర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, లక్నో, ఢిల్లీ, వారణాసి విమానాశ్రయాల్లో ఈ సర్వీసులను హోంశాఖ అందించనుంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల రక్షణ కోసమే ఈ సిమ్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఎస్ఎన్ఎల్ సౌజ్యనంతో ఉచితంగా ఈ ప్రి-లోడెడ్ సిమ్ కార్డులను అందించే కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభించనున్నారు. ఈ వీసా ద్వారా వచ్చే వారికి ఈ సౌకర్యం అందిస్తారు. దీనిని తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. -
ఫారిన్ టూరిస్టులకు ఫ్రీ సిమ్ కార్డులు
భారతదేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీయులకు ప్రభుత్వం ఫ్రీ సిమ్ కార్డులను అందజేయనుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వశాఖ త్వరలో చర్యలు తీసుకోనుంది. విదేశీ టూరిస్టులను ఆకర్షించడమే కాకుండా వారికి సెక్యూరిటీని కల్పించడం కూడా ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యాటక, హోమ్ , టెలికం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం దీనిపై కసరత్తు మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు ఉచితంగా మంజూరు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పర్యాటకులకు ఇక్కడ లోకల్ సిమ్ కార్డులు దొరకడం కాస్త కష్టమైన విషయమే, వారి సౌకర్యార్థమే కాకుండా భద్రతా కారణాల రీత్యా కూడా ప్రభుత్వం సిమ్ కార్డులను ఉచితంగా మంజూరు చేయాలనుకోవడం ఓ మంచి ఆలోచన అని అన్నారు. ఈ సిమ్ కార్డును ప్రభుత్వం అందజేసే టూరిస్ట్ కిట్‌తో పాటే పర్యాటకులకు అందించనున్నారు. సాధారణంగా టూరిస్ట్ కిట్లలో మ్యాప్‌లు, టూరిజం బుక్ లెట్లు, ఎమర్జెన్సీ నెంబర్లు, గమ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. వీటితోపాటే లోకల్ సిమ్ కార్డును కూడా అందించడం ద్వారా విదేశీయులు మరింత సౌకర్యవంతంగా,నిరంతరాయంగా తమ హాలిడేను కొనసాగించవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా విదేశీ పర్యాటకులకు భారత ప్రభుత్వం సులువైన పద్ధతిలో వీసాలను మంజూరును మొదలుపెట్టింది. టూరిస్ట్ వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్ లైన్లోనే అప్లై చేయవచ్చు. ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు అప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వం పంపించే ఈ-మొయిల్ ప్రింట్ అవుట్ మీద భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు వేసే స్టాంపుతో విదేశీయులు ఇండియాలో పర్యటించగలరు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ తరహా 'ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా' పద్ధతిని 2015 ఏప్రిల్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇండియా 113 దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. మార్చి 31, 2016 వరకు 150 దేశాలకు ఈ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాలో పర్యటించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లెక్కల ప్రకారం యూకే పౌరులు అధికంగా భారతదేశాన్ని సందర్శిస్తుండగా ఆ తరువాతి స్థానాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.