గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది జనవరిలో 7.91 లక్షల మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించగా, ఈ సంఖ్య 2016 జనవరిలో 8.44 లక్షలకు పెరిగింది. విదేశీ పర్యటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 6.8 వృద్ధిని సాధించింది. టూరిజం నుంచి వచ్చే విదేశీ మారక నిల్వలు(ఫారన్ ఎక్స్ఛేంజ్ ఎర్నింగ్స్) గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది 13 శాతం పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
విదేశీ పర్యటకులలో జనవరి నెలలో టాప్ స్థానంలో నిలిచిన దేశాలు:
1) అమెరికా 2) బంగ్లాదేశ్ 3) యూకే 4) కెనడా 5) అస్ట్రేలియా 6)రష్యా 7)జర్మనీ 8)ఫ్రాన్స్ 9) శ్రీలంక 10)చైనా 11) మలేషియా 12) జపాన్ 13)కొరియా 14)నేపాల్ 15) అఫ్ఘనిస్తాన్
మన దేశంలో ఎక్కువగా విదేశీ పర్యటకులు అడుగుపెట్టిన ప్రాంతాలు:
1)ఢిల్లీ ఎయిర్ పోర్టు 2)ముంబై ఎయిర్ పోర్టు 3) చెన్నై ఎయిర్ పోర్టు 4)హరిదాస్ పూర్ లాండ్ చెక్ పోస్ట్ 5)బెంగళూరు ఎయిర్ పోర్టు 6) గోవా ఎయిర్ పోర్టు