
విదేశీ పర్యటనలను తగ్గించుకోనున్న మోదీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 19 నెలల కాలంలో 33 దేశాల్లో పర్యటించిన నరేంద్ర మోదీ.. కొత్త ఏడాదిలో కాస్త జోరు తగ్గించనున్నారు. ఈ ఏడాదిలో మోదీ విదేశీ పర్యటలను తగ్గించుకోనున్నట్టు పీఎంఓ అధికారులు చెప్పారు.
ప్రధాని మోదీ ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సులు, పర్యటనలకు మాత్రమే వెళ్లనున్నట్టు సమాచారం. భారత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే పర్యటనలకు మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఎక్కువగా విదేశీ పర్యటనకు వెళ్తున్న మోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనల వల్ల భారత్ ఏమి సాధించదని ప్రశ్నించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మోదీని ఎఆర్ఐ మోదీగా అభివర్ణించింది.