మదనపల్లె: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విదేశీ యువతిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జర్మనీకి చెందిన ఇద్దరు యువతులు, ఢిల్లీకి యువతులతో కలసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు వచ్చారు.
వీరందరు స్థానిక సీటీఎం రోడ్డులోని చైతన్య రెస్టారెంట్‌లో దిగారు. అదే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రామాంజనేయులు అనే యువకుడు బుధవారం రాత్రి గది తలుపులు పగులగొట్టి గదిలోనికి చోరబడి జర్మనీకి చెందిన ఓ యువతిపై లైంగిక దాడి చేశాడు. మిగిలిన యువతులనూ లైంగికంగా వేధించాడు. ఈ విషయమై గురువారం ఉదయం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.