కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లిన చంద్రబాబు | Chandrababu naidu one more secret foreign tour with family | Sakshi
Sakshi News home page

కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లిన చంద్రబాబు

Published Fri, Sep 2 2016 8:26 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లిన చంద్రబాబు - Sakshi

కుటుంబంతో కలిసి టూర్కు వెళ్లిన చంద్రబాబు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 5వ తేదీ వరకూ చంద్రబాబు వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. అయితే సీఎం పర్యటన వివరాలను టీడీపీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. చంద్రబాబు పర్యటనకు  ఎక్కడికి వెళ్లారో కూడా తమకు తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు.

కాగా గతంలోనూ చంద్రబాబు దాదాపు 5 రోజులపాటు కుటుంబంతో ఎంజాయ్ చేశారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు.. ఏ దేశంలో పర్యటించారు.. ఎక్కడ విడిది చేశారనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ  క్లారిటీ లేదు. సాధారణంగా చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళితే మీడియాలో బాగానే కవరేజ్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశీ పర్యటనల సమయంలో ఛానల్స్, పత్రికలకు సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ పర్యటనను కూడా చంద్రబాబు గోప్యంగా ఉంచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement