Family Tour
-
రేపు తాడేపల్లికి సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శనివారం) ఉదయం తాడేపల్లి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈనెల 17న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. దాదాపు 13 రోజుపాటు అక్కడ కుటుంబంతో కలిసి గడిపారు. నేటి రాత్రి లండన్ నుంచి తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. -
మంచులో చిల్ అవుతున్న మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసిన సూపర్‌స్టార్!
ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్‌కు వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. తాజాగా మరో హాలిడే ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నట్లున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్‌బాబు శుక్రవారం విదేశాలకు పయనమయ్యారు. హ్యాపీగా.. జాలీగా యూరప్ వెళ్లారని తెలిసింది. కాగా ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేశ్‌బాబు మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటంతో మహేశ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
దూసుకెళ్తున్న కార్లు.. ఆ జిల్లాలో నెలకు 400 కార్ల విక్రయాలు
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కారు హోదాగా భావించే సగటు కుటుంబాలు.. ఇప్పుడు నిత్యావసరంగా భావిస్తున్నాయి. సొంత ఇల్లు ఎంత ముఖ్యమో కారు ఉండటమూ అంతేననే ఆలోచన ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి సొంతకారులో ప్రయాణించాలన్న ఆలోచన బలంగా ఏర్పడింది. కార్లకు భారీ డిమాండ్.. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంగా మహా అంటే నెలకు 80 నుంచి 100 కార్లు అమ్ముడయ్యేవి. తాజా గణాంకాలు చూస్తే నెలకు 400కు పైగా అమ్ముడవుతున్నాయి. దీన్నిబట్టి కార్ల డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయచ్చు. కియా, మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, టాటా వంటి కార్లకు బాగా డిమాండ్ ఉంది. కారు బుక్ చేసుకున్న తర్వాత కనీసం మూడు మాసాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్టు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కార్లకు 6 మాసాలు కూడా పడుతోంది. పండుగలు, ప్రత్యేక పర్వదినాల వేళ 500 కార్లు అమ్ముడైన సందర్భాలున్నాయి. కుటుంబ ప్రయాణాలపై మొగ్గు.. ఒకప్పుడు బస్సు, రైలు ప్రయాణాలు ఎక్కువ. ఇప్పుడు రూ.40 వేలు వేతనం తీసుకునే ఉద్యోగి కూడా కుటుంబంతో కలిసి కారులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు సులభతర వాయిదాల్లో లోన్లు లభిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కార్లలో ప్రయాణమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. కొత్త కార్లకే కాదు సెకండ్ హ్యాండ్ కార్లకూ ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నట్టు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. కొనుగోలు శక్తి పెరిగింది ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం జిల్లాలో కార్ల అమ్మకాల మార్కెట్ పెరిగింది. – వంశీ, జనరల్ మేనేజర్, మహీంద్రా కంపెనీ అక్కడ జాప్యం జరుగుతోందని.. మాది కృష్ణా జిల్లా కలిదిండి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొనాలనుకున్నా. కానీ విజయవాడలో 7 మాసాలు వెయిటింగ్ అని చెప్పారు. తెలిసిన వాళ్లుంటే అనంతపురంలో కొన్నా. ఈ వారంలో డెలివరీ ఇస్తున్నారు. ఆ వాహనం నాకు బాగా ఇష్టం. – ఎం.నాగరాజు, కలిదిండి ఆదాయం గణనీయంగా పెరిగింది రవాణాశాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.42 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. డిసెంబర్ నాటికి రూ.154 కోట్లు టార్గెట్ కాగా రూ. 132 కోట్లు వసూలైంది. ఇందుకు కారణం వాహనాల కొనుగోలు పెరగడమే. ముఖ్యంగా కార్ల కొనుగోలు శాతం భారీగా పెరిగింది. మధ్యతరగతి వారు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు. – శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్, అనంతపురం -
ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను సొంతంగా తయారు చేసిన ఫోర్ సీటర్ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 18 నెలలు శ్రమించి.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్ టీఎస్ఐ’ మోడల్లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్‌కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను చుట్టేసి వచ్చాడు. విమానాన్ని ఎలా తయారు చేశానంటే.. ‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్ఐ మోడల్ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్‌పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్‌డౌన్‌తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ) -
ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్.. ఎమ్మెల్యే హఠాన్మరణం!
ముంబై: కుటుంబంతో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే.. దుబాయ్‌లో హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో అక్కడే ఆయన కన్నుమూశారు. మృతి చెందిన ఎమ్మెల్యేను మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే(52) గా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారు. ఆయన విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. Shocked to hear the news of Shiv sena MLA Ramesh Latke’s sudden demise! I Remember meeting him on a flight to kokan for angnewadi jatra just few months back.. I praised him for losing so much weight because of dieting.. He was a friend beyond party lines.. Unbelievable!! RIP🙏🏻 — nitesh rane (@NiteshNRane) May 12, 2022 ముంబై అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు. Saddened and shocked to hear about the passing of Shri Ramesh Latke ji. His constant energy, his dedicated work during COVID & his connect with the constituency was immense. He will be missed& he has gone too soon. My heartfelt condolences to his family, friends and colleagues. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 12, 2022 -
Travel Tips: సోలంగ్ వ్యాలీ పర్యాటన ఓ అందమైన అనుభూతి..!
సోలంగ్ టూర్లో అడ్వెంచరస్ స్పోర్ట్స్ హబ్ సోలంగ్ వ్యాలీనే. సోలాంగ్ నది పరివాహక ప్రదేశం ఇది. మనాలికి 13 కిమీల దూరాన ఉంది. కులు–మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైన తర్వాత సినిమా షూటింగ్‌లు సోలంగ్ వ్యాలీలో జరుగుతున్నాయి. ఇప్పుడా సోలంగ్ వ్యాలీ పర్యాటకుల సాహస క్రీడావిహారానికి కేంద్రమైంది. ట్రెకింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్, స్నో స్కీయింగ్, గ్రాస్ స్కీయింగ్, హార్స్ రైడింగ్, స్నో స్కూటర్ రేస్, రివర్ క్రాసింగ్, వాల్ క్లైంబింగ్ వంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడ పారా గ్లైడింగ్ చేశారు. అయితే సమీప గతంలో కాదు, అది గుజరాత్‌కి ముఖ్యమంత్రి కాక ముందు మాట. రొటీన్‌కి భిన్నంగా మనాలి పర్యటనలో రొటీన్‌గా చూసే మంచు కొండల్లో విహారానికి పరిమితం కాకుండా మరికొంచెం ఆసక్తిగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నగ్గర్ కోటలో బస, సాహసక్రీడలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు, ఆ ప్రదేశానికి పరిమితమైన వైవిధ్యమైన వాస్తుశైలి, జలపాతాల స్వచ్ఛత, నదిలో విహరింతలను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. మాల్ రోడ్డులో ఏమీ కొనకపోయినా సరే... హనీమూన్ కపుల్ చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడవడమే జీవితమంతా గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే కేబుల్ కార్ విహారం కూడా. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ఇవన్నీ చూడాలి! హిడింబాలయం పాండవులలో రెండవ వాడు భీముని భార్య హిడింబి. ఆమె ఆలయమే ఇది. మనాలి సమీపంలోని దుంగ్రీ అటవీ ప్రాంతంలో ఉంది. మనాలి టూర్ ప్యాకేజ్‌లలో హిడింబ ఆలయం తప్పక ఉంటుంది. హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్స్ మ్యూజియం ఇది హిడింబ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ ప్రదేశంలో విలసిల్లిన నాగరకతను పురాతన వస్తువులు, ఆయుధాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. టిబెట్ మఠాలు మనాలిలో స్థిరపడిన టిబెట్ వాళ్ల నివాస ప్రదేశాలివి. నిర్మాణశైలి పరంగా ప్రత్యేకంగా ఉంటాయి. రంగులు కూడా ఆసక్తిగొలుపుతుంటాయి. వశిష్ఠ ఆలయం ఇది ఏకశిలలో తొలిచిన ఆలయం. ఈ ఆలయంతోపాటు ఇక్కడి వేడినీటి గుండాలు ప్రధాన ఆకర్షణ. జోగ్ని జలపాతం మంచుకొండలు, వేగంగా ప్రవహించే నదుల మధ్య ఉధృతంగా నేలకురికే జలపాతం సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. స్వయంగా వీక్షించి ఎవరికి వాళ్లు అనుభూతి చెందాల్సిందే. నయింగ్మ టెంపుల్ ఇది మనాలి, మాల్‌రోడ్‌లో ఉన్న బుద్ధుని ఆలయం. నిర్మాణశైలిపరంగా చూసి తీరాల్సిన ఆలయం. శాక్యముని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా తినవచ్చు! ఈ పర్యటనలో రకరకాల రుచులను మిస్ కాకూడదు. మౌంట్ వ్యూ రెస్టారెంట్లో టిబెట్, జపాన్, చైనా, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ రుచి చూడవచ్చు. చలిమంట వెచ్చదనంతోపాటు బార్బిక్యూ వంటలను ఆస్వాదించాలంటే బాసిల్ లీఫ్ రెస్టారెంట్‌కెళ్లాలి. మనాలి హిమాలయాల నేపథ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే రూఫ్‌టాప్ రెస్టారెంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన. ఇది నగ్గర్ రోడ్లో ఉంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఎప్పుడు! ఎలా! హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలంగ్– మనాలి టూర్‌కి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే. సమీప విమానాశ్రయం భుంటార్ ఎయిర్‌పోర్టు. ఇది మనాలి సిటీసెంటర్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కొనుక్కోవచ్చు ►మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ►సింగింగ్ బౌల్: ఇది బౌద్ధానికి ప్రతీక. హిమాచల్ ప్రదేశ్, టిబెట్ రోజువారీ జీవితంలో భాగం. దీని నుంచి వచ్చే శబ్దం, ఆ ప్రకంపనలు వాతావరణాన్ని ఆహ్లాదపరచడంతోపాటు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను కలిగిస్తాయని చెబుతారు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సింగింగ్ బౌల్స్‌ను కొంటారు. ►కులు షాల్: ఉలెన్ దుస్తుల విభాగంలో అడుగుపెడితే దేనిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. స్వెటర్లు, మఫ్లర్లు, క్యాప్‌లు వందల రకాలుంటాయి. ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఈ ట్రిప్‌కు గుర్తుగా కులు, కిన్నౌరి షాల్ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. రకరకాల షేడ్లలో ఏ రంగు దుస్తులకైనా మ్యాచ్ అయ్యేటన్ని మోడల్స్ ఉంటాయి. ►ప్రేయర్ వీల్: ఇది టిబెట్ సంప్రదాయంలో ప్రధానమైనది. లోహం, చెక్క, తోలుతోపాటు రాతి చక్రాలు కూడా ఉంటాయి. ఈ వీల్స్ మీద టిబెట్ భాషలో ‘ఓంమణి పద్మే’ అనే మంత్రం ఉంటుంది. ఈ టూర్ గుర్తుగా డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. ►దోర్జీ బెల్: ఇది కూడా టిబెట్ సంప్రదాయ వస్తు విశేషమే. గంట ఆకారంలో ఉంటుంది. మనాలిలో ఏ వస్తువైనా సరే ప్రభుత్వం అనుమతి పొందిన స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. మామూలు దుకాణాల్లో ధరలు ఆకాశాన ఉంటాయి. బేరం చేయగలిగిన సామర్థ్యానికి పరీక్ష. గట్టిగా బేరం చేయగలిగితే ధరలను నేల మీదకు దించవచ్చు. కానీ టూర్లో సమయం చాలా విలువైనది. బేరం చేయడం కోసం అంత సమయం వృథా చేయడం అర్థరహితం. మాల్ రోడ్ తర్వాత మనాలిలో హాంగ్‌కాంగ్ మార్కెట్ మీద ఓ కన్నేయవచ్చు. ట్రావెల్ టిప్స్ ►మాల్ రోడ్లో పగలు జరిగినంత షాపింగ్ రాత్రి కూడా జరుగుతుంది. హస్తకళాకృతులు లెక్కలేనన్ని రకాలుంటాయి. ఈ దుకాణాలను చూస్తే పురాతనంగా కనిపిస్తాయి. కానీ అన్నింటిలోనూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్ చేయవచ్చు. ►మాల్ రోడ్లో దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పర్యటించేటప్పుడు విలువైన వస్తువులను దగ్గర ఉంచుకోకపోవడమే మంచిది. షాపింగ్ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్‌ను పక్కన పెట్టి మరీ వస్తువుల నాణ్యతను పరిశీలిస్తాం. అలాంటి సమయంలో మళ్లీ చూసుకునేటప్పటికి బ్యాగ్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కింద పెట్టిన బ్యాగ్ గురించి మనమే మర్చిపోవచ్చు కూడా. కొంత దూరం వెళ్లిన తరవాత గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చినా ప్రయోజనం ఉండదు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్‌క్రీమ్‌తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ. కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్ మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు... -
సెలవుల్లో ఇలా ఎగిరిపోదామా?
మనిషి సోషల్ యానిమల్. మనసు ఫ్లయింగ్ బర్డ్! ఉండేందుకు ఒక చోటు లేకున్నా బతికేయొచ్చు. ఒకేచోట ఉండిపోతే... పంజరమే మానవజన్మ. 2020లో మానవపక్షులన్నీ నాలుగు గోడల మధ్యే ఉండిపోయాయి. 2021లో కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. బస్సెక్కి, రైలెక్కి, విమానమెక్కి.. నాలుగడుగులు వేస్తే ఎంత బాగుంటుంది! సెలవులున్నాయి. ఈవెంట్స్ ఉన్నాయి. బండి దిగొచ్చేవారి కోసం..పన్నెండు నెలలూ వేచి చూస్తున్నాయి. రుతువులొచ్చాయి. మనిషి జాడ లేకనే వెళ్లిపోయాయి. ఎవరి కోసం పూయాలి? ఎవరి కోసం ‘కుహూ..’ మని కూయాలి? నిరుడంతా ప్రకృతికి నిరుత్సాహం. కరోనా కర్ర పట్టుకుని నిలుచుంటే బయటికేం వస్తాం? చైత్ర వైశాఖ జ్యేష్ట ఆషాడ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర మాసాలు (పుష్య మాఘ పాల్గుణాల తర్వాతే కరోనా గృహ ప్రవేశం చేసింది), వసంత గ్రీష్మ వర్ష శరద్ హేమంతాలు (శిశిరం తర్వాతే కరోనా కుడికాలు పెట్టింది) మానవ స్పర్శ లేకనే నిష్క్రమించాయి. అప్పటికీ చైనా ధైర్యం చేసింది. శరత్ రుతువులో బయటికి వచ్చింది. ‘రివెంజ్ ట్రావెల్’ పేరుతో (కరోనాపై రివెంజ్) జాతీయ దినం అక్టోబర్ 1 నుంచి పది రోజులు నేషనల్ హాలిడే ప్రకటించుకుంది. ‘ప్రజలారా ఇళ్లలోంచి రండి. బయట విహరించండి. కరోనాను ధిక్కరించండి’ అని పిలుపునిచ్చింది. అప్పటి వరకు క్వారెంటైన్లతో, లాక్డౌన్లతో, రిస్ట్రిక్షన్లతో.. బయటి తిండి కోసం, బయట తిరగడం కోసం అలమటించి ఉన్నవారు కదా.. తక్షణం శృంఖలాలు తెంచుకున్నారు. పిల్లల్ని, ట్రావెల్ బ్యాగ్‌లను భుజాన వేసుకుని బయటికి వచ్చారు. ఆ పది రోజుల్లో 55 కోట్ల మంది చైనావాళ్లు వాళ్ల దేశమంతటా విహంగాలై పర్యటించారు. ఆగస్టు నాటికి ఇండియాలో ‘తెగింపు’ వచ్చేసింది. ఒక బ్యాచ్ 70 రోజుల పాటు, 20 కి.మీ. దూరం ఢిల్లీ టు లండన్.. మయన్మార్, థాయిలాండ్, లావోస్, చైనా, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలెండ్, చెక్, జర్మనీ, బెల్జియం.. మొత్తం 18 దేశాల పర్యటనకు బయల్దేరింది! తైవాన్ రాజధాని తాయ్ పే లోనైతే జూలైలో సాంగ్షాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కిటకిటలాడింది. చెక్–ఇన్, పాస్ పోర్ట్ కంట్రోల్, సెక్యూరిటీ, బోర్డింగ్.. ప్రతి చోట.. విమానాలు బయలుదేరక ముందే ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కి లగేజ్‌లు, బ్యాగేజ్లు వేసుకొచ్చేశారు. ఫ్లయిట్ ఎక్కి కూర్చున్నారు. కాక్‌పిట్ నుంచి అనౌన్స్మెంట్ వినిపిస్తే సీట్ బెల్ట్‌లు కూడా బిగించుకున్నారు. ఆ తర్వాత అసలు గాల్లోకే లెయ్యని విమానం నుంచి నిచ్చెన మీదుగా నేలపైకి ల్యాండ్ అయ్యారు! మిగతా ఫ్లయిట్స్ కూడా అంతే. అవి ఎక్కడికీ వెళ్లలేదు. కూర్చున్నవాళ్లే.. ఎక్కడికో వెళ్లొచ్చినట్లు విమానాలు దిగేశారు. అంటే అన్నీ ఫేక్ విమానాలు, ఫేక్ ప్రయాణ అనుభూతులు. ఏదో ఒకటిలే ఇల్లు కదిలితే చాలు ప్రజలు టికెట్లు కొనేశారు. కొత్త సంవత్సరం కొంచెం ‘నాన్–కరోనాటిక్’గా కనిపిస్తోంది. వ్యాక్సిన్లు కూడా వచ్చేశాయి. టూరిస్ట్ స్పాట్లను శుభ్రం చేసి రెడీగా ఉంచారు. గత ఏడాదంతా అలికిడే లేని పర్యాటక కేంద్రాలలో సందడి మొదలవుతోంది. ప్రయాణ ఆంక్షలు దాదాపుగా తొలగిపోయాయి. సెలవుల్ని చక్కగా ప్లాన్ చేసుకోవడమే ముందున్న కాలమంతా. ఈ న్యూ ఇయర్లో ఐదు రోజులే కదా గడిచింది. ముందింకా ఎన్నో రోజులు. ఎన్నో పండుగలు. తిలకించేందుకు ఎన్నో ప్రకృతి మహత్యాలు, సాంస్కృతిక వైభవాలు! వాటిని చూడడానికి ముందుగా.. ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులున్నాయో, చూడవలసినవి ఏవి ఉన్నాయో చూద్దాం. చూడ్డమే ఈ ఏడాదంతా మనం చేయవలసిన పని. ఇంకో పని కూడా చేయాలి. ఆదివారం కలిసొచ్చేలా శనివారం; శనీ ఆదివారాలు కలిసొచ్చేలా శుక్రవారం సెలవు పెట్టడం. వీలైతేనే. విధిగా కాదు. ఉద్యోగమనే విధికి అడ్డు తగలకుండా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్(అహమ్మదాబాద్) జనవరి 14 సంక్రాంతి. 15 శుక్రవారం సెలవు పెడితే 16, 17 శని, ఆదివారాలు. 23, 24 మళ్లీ శని, ఆదివారాలు. 26 రిపబ్లిక్ డే. 25 సెలవు పెడితే 24 ఆదివారం. వరుసగా మూడు రోజులు. ఇవి చూడొచ్చు :అహమ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్; బికనీర్, రాజస్థాన్‌లలో బికనీర్ కామెల్ ఫెయిర్ (జనవరి 12–13); శ్రీనగర్, జమ్ము–కశ్మీర్; ఉత్తరాఖండ్‌లోని ఆలీకి స్కీయింగ్ ట్రిప్, కచ్ గుజరాత్లో వైట్ డెజర్ట్. ఆ ఉప్పు ఎడారిని సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. కళ్లు జిగేల్మంటాయి. జిరంగ నేషనల్ పార్క్ (అస్సాం) ఫిబ్రవరి 13, 14 శని, ఆదివారాలు. 15 సెలవు పెడితే 16 వసంత పంచమి. ఇవి చూడొచ్చు : ఎప్పుడూ పార్టీలు జరుగుతుండే గోవా, తాజ్‌మహల్ (ఆగ్రా), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం), ఉదయ్‌పూర్, జైసల్మేర్, జో«ద్‌పూర్ (రాజస్థాన్), పురాతన నగరం వారణాసి; ఖజురహో–హెరిటేజ్ టూర్ (మధ్యప్రదేశ్). బృందావనంలో హోలీ మార్చి 11 మహా శివరాత్రి. 12 శుక్రవారం సెలవు పెడితే 13, 14 శని, ఆదివారాలు. 26 శుక్రవారం సెలవు పెడితే 27, 28 శని, ఆదివారాలు. 29 హోలీ. ఇవి చూడొచ్చు : హోలీకి బృందావనం (మధుర), ప్రకృతి దృశ్యాల కోసం ఊటీ, వన్యప్రాణుల కోసం రాజస్థాన్‌లోని రంథంబోర్, మానసిక సాంత్వన కోసం సిక్కిం, యాత్రా స్థలంగానైతే మౌంట్ అబూ. చారిత్రక శిథిల కట్టడాలకు హంపీ. గుల్మార్గ్ స్కీయింగ్ (కశ్మీర్) ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే. 3, 4 శని, ఆదివారాలు. ఈ నెలలో ఇంతే. శని ఆదివారాలకు కలిసొచ్చేవి లేవు. ఇవి చూడొచ్చు : చల్లదనం కోసం జమ్ము–కశ్మీర్. పెంచ్ నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్), ఉదయ్‌పూర్, ట్రెక్కింగ్ కోసం కొడైకెనాల్, స్కీయింగ్‌కి గుల్మార్గ్, వైన్ యార్డ్ చూడాలంటే నాసిక్. నీలాకాశ వీక్షణకు, బీచ్‌లకు లక్షద్వీపాలు, స్వచ్ఛమైన గాలి కోసం కూర్గ్. ధర్మశాలలో క్రికెట్ స్టేడియం మే 13 ఈదుల్ ఫిత్ర్. 14 సెలవు పెడితే 15, 16 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు :రిషికేశ్, ముస్సోరి (ఉత్తరాఖండ్), కొడైకెనాల్ (తమిళనాడు), స్పితీ వ్యాలీ (హిమాచల్ ప్రదేశ్), కాలింపాంగ్ (పశ్చిమ బెంగాల్), వేయనాడ్ (కేరళ), ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్) అల్మోరా, ఉత్తరాఖండ్ జూన్ జూన్‌లో శని, ఆది వారాలకు కలిసొచ్చే సెలవు రోజులు లేవు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవమైన జూన్ 2 ఈ ఏడాది బుధవారం వచ్చింది. ఇక వేళ రెండు మూడు రోజులు సెలవు దొరికితే.. ఇవి చూడొచ్చు : చిక్మగళూర్ (కర్ణాటక), లడఖ్, అండమాన్; గాంగ్టక్ (సిక్కిం), అల్మోరా (ఉత్తరాఖండ్). ఈ నెలలో ఈ ప్రదేశాలలోని వాతావరణం సమ శీతల ఉష్ణస్థితిలో ఆహ్లాదంగా ఉంటుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (ఉత్తరాఖండ్) జూలై 10, 11 శని, ఆదివారాలయ్యాయి. 12 రథయాత్ర. 17, 18 శని, ఆదివారాలు. 19 సెలవు పెడితే 20 బక్రీద్. ఇవి చూడొచ్చు : పూరి రథయాత్ర (ఒడిశా), వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ (ఉత్తరాఖండ్), శివస్థలి అమర్నాథ్. మౌంట్ అబు (రాజస్థాన్) ఆగస్ట్ 28, 29 శని, ఆదివారాలు. 30 జన్మాష్టమి. ఇవి చూడొచ్చు : జన్మాష్టమి ఉత్సవాల కోసం బృందావనం, కూనూరు (తమిళనాడు), చిరపుంజీ (మేఘాలయ), జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్), మౌంట్ అబూ (రాజస్థాన్) హర్మందిర్ సాహిబ్ (అమృత్సర్) సెప్టెంబర్ 10 వినాయక చవితి. 11, 12 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు: అమృత్సర్, కేరళ, శ్రీనగర్, కూర్గ్, పాండిచ్చేరి, ముంబై, మహాబలేశ్వర్, గుజరాత్‌లోని విల్సన్ హిల్స్. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖంలో ఉండి, వాతావరణం తడిపొడి సమ్మేళనంగా ఉల్లాసభరితంగా ఉంటుంది కనుక పర్యాటనకు అనువైన ప్రదేశాలలో ఇవి కొన్ని. కులు దసరా సంబరాలు అక్టోబర్ 15 దసరా. 16, 17 శని, ఆదివారాలు. ఇవి చూడొచ్చు :దసరా సంబరాలకు కులు (హిమాచల్ ప్రదేశ్), రివర్ రాఫ్టింగ్‌కి రిషికేశ్, దుర్గాపూజకు కోల్‌కతా, వన్యప్రాణి వైవిధ్య వీక్షణకు మానస్ నేషనల్ పార్క్ (అస్సాం), జాపపద సంస్కృతుల కోసం జో«ద్‌పూర్; మైసూరు. భరత్పూర్ (రాజస్థాన్) పక్షుల ఆవాసం నవంబర్ 19 గురు నానక్ జయంతి. 20, 21 శని, ఆదివారాలు ఇవి చూడొచ్చు : ఫుష్కరోత్సవాలు (రాజస్థాన్), నైట్ లైఫ్ కోసం గోవా, పక్షుల్ని చూడటానికి భరత్పూర్ (రాజస్థాన్); రాయల్ బెంగాల్ టైగర్లను చూడ్డానికి సుందర్బాన్ (పశ్చిమ బెంగాల్), మంచుకొండల కోసం మనాలీ (హిమాచల్ ప్రదేశ్) కబిని అభయారణ్యం (కర్ణాటక) డిసెంబర్ 24 సెలవు పెడితే 25 క్రిస్మస్, 26 ఆదివారం. ఇవి చూడొచ్చు : కబిని వన్యప్రాణి అభయారణ్యం (కర్ణాటక), స్కీయింగ్‌కి ఆలీ (ఉత్తరాఖండ్), కచ్ (గుజరాత్). -
వయసుని గెలిచారు
నాగార్జున తన 60వ పుట్టిన రోజును జరుపుకోవడానికి కుటుంబంతో సహా స్పెయిన్ వెళ్లారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తున్నట్టు సమంత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కుటుంబమంతా కలసి దిగిన ఈ ఫొటోను సమంత షేర్ చేస్తూ ‘‘మామయ్యా.. అందరూ దేనికోసమైతే వెతుకుతుంటారో అది మీ దగ్గర ఉంది. ప్రతీదాంట్లో సంతోషాన్ని వెతికి మరీ ఆనందంగా ఉంటారు.. మీ చుట్టూ ఉండి నేను నేర్చుకున్నది అదే. మీరు వయసుని జయించారు మామా’’ అన్నారు. -
కొత్త గర్ల్ ఫ్రెండ్... కొత్త బాయ్‌ఫ్రెండ్
డేటింగ్ ప్రేమికుల మధ్యే కాదు...రక్తసంబంధీకులు, స్నేహితులు.సన్నిహితులతో కూడా చేయొచ్చు!మన కోసం జీవితాన్ని పిండేసినమమ్మీడాడీతో చేయొచ్చు..మమ్మీడాడీ లేక అనాథశ్రమంలో ఉన్నబుజ్జి స్నేహితులతో చేయొచ్చు!నిజానికి ఇంతకంటే ప్రియమైన డేటింగ్ఇంకెక్కడైనా దొరుకుతుందా... చెప్పండి? హైదరాబాద్.. ఇనార్బిట్ మాల్... ఒక ఇరవైమూడేళ్ల అమ్మాయి.. పక్కనే బహుశా వాళ్ల అమ్మనుకుంటా.. చేయి పట్టుకొని రెస్టారెంట్లోకి తీసుకెళ్లింది అమ్మాయి. రోడ్ సైడ్ వ్యూ ఉన్న కార్నర్ టేబుల్‌ను వెదుక్కొని మరీ వాళ్లమ్మను కూర్చోబెట్టింది. ఎదురుగా తను. మెనూ కార్డ్ తీసుకొని.. ఐటమ్స్ అన్నీ చదివి వినిపించింది. నచ్చింది ఆర్డర్ చేయమని చెప్పింది వాళ్లమ్మకు. బెరుకు బెరుకుగానే ఆర్డర్ చేసింది ఆవిడ. బేరర్ వెళ్లిపోయాక.. ఆ అమ్మాయి లేచి తల్లి దగ్గరకు వెళ్లి ప్రేమగా హత్తుకుంది.. ఓ సెల్ఫీ తీసుకుంది. వెంటనే సోషల్ మీడియాలో పోస్టూ చేసినట్టుంది. లంచ్ అయ్యాక.. అక్కడే షాపింగ్ చేశారు.. చిన్నపిల్లల్లా అల్లరి చేశారు. ఐస్‌క్రీమ్ తిన్నారు. కామెంట్స్ చేసుకున్నారు.. జోక్స్ వేసుకున్నారు. వాళ్లమ్మకు తన సెల్ఫోన్లో (ఫేస్బుక్కో.. ఇన్‌స్టాగ్రామో అయ్యుంటుంది) ఏదో చూపించింది.. ఆ అమ్మేదో అంది.. ఆ పిల్ల టైప్ చేసింది. మొత్తానికి ఆ ఇద్దరి వయసుల్లో తేడాను బట్టి తల్లీ, బిడ్డగా అంచనా వేయడమే తప్ప వాళ్ల చనువు, స్నేహం చూస్తే ఫ్రెండ్సే అనుకుంటారు. అంతా తిరిగి ఓ బెంచ్ మీద కూర్చున్నారిద్దరూ. ఉండబట్టలేక ఆ పిల్లను కదిలిస్తే.. ‘‘మా అమ్మండీ.. సింగిల్ మదర్. నాకు మూడేళ్లప్పుడు మా నాన్న యాక్సిడెంట్లో పోయాడు. మా పేరెంట్స్‌ది లవ్ మ్యారేజ్. నాన్న పోయాక కూడా అమ్మమ్మవాళ్లు కాని, నానమ్మ వాళ్లు కాని అమ్మను రానివ్వలేదు. ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా వర్క్‌చేస్తూ నన్ను పెంచింది. ఆటోమోబైల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ని. జాబ్‌లో చేరి టూ ఇయర్స్ అవుతోంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం జర్మన్ యూనివర్సిటీలో అప్లయ్ చేసుకున్నా. సీట్ వచ్చింది. వెళ్లే ప్రిపరేషన్లో ఉన్నా. ఈ బిజీలో ఒక్కరోజు కూడా అమ్మతో లీజర్‌గా స్పెండ్ చేయలేదు. ఇప్పుడు నేను వెళ్లిపోతే తను మళ్లీ ఒంటరే. అందుకే ఈ వీకెండ్ అమ్మతో గడపాలని.. ఐ మీన్ మా అమ్మతో డేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నా. నిన్న (శనివారం) ఆర్టికిల్ ఫిప్టీన్ సినిమా, చార్మినార్, ఈరోజు (ఆదివారం) ఇలా వర్కవుట్ చేస్తున్నా’’ అంటూ వాళ్లమ్మను మళ్లీ దగ్గరకు తీసుకుంది ప్రేమగా. ఆ తల్లి కళ్లల్లో సన్నని కన్నీటి తెర.‘‘ఒక్క ఫొటో తీసుకోవచ్చా మీ ఇద్దరిదీ?’’ అని సెల్‌ఫోన్‌లోని కెమెరాను సెట్ చేసుకోబోతుంటే ఆ అమ్మ ‘‘అయ్యో.. వద్దండీ’’ అంటూ ఇబ్బంది వ్యక్తం చేసింది. గమనిక: ఈ మ్యాటర్ ఆ ఇద్దరి అనుమతితోనే ఇక్కడ రాశాం. సుమిత్.. ముప్పైఏళ్లు. బెంగళూరులో ఉద్యోగం. సొంతూరు విశాఖపట్టణం. అతని చిన్నప్పటి స్నేహితురాలు శాలిని అమెరికా నుంచి వస్తే ఆమెను కలవడానికి ఊరెళ్లాడు. ఆమె అతణ్ణి ఓ అనాథ శరణాలయానికి తీసుకెళ్లింది.. డబ్బు డొనేట్ చేయాలని. వెళ్లాక శాలినికి ఓ ఆలోచన వచ్చింది. ‘‘సుమిత్ ఈ పిల్లలను డేట్‌కు తీసుకెళితే?’’ అని. మెచ్చుకోలుగా చూశాడు సుమిత్. ఆలస్యం చేయకుండా ఆ పిల్లలను అడిగారు ‘‘బయటకు వెళదామా?’’ అని. ‘‘బీచ్‌కి’’ చెప్పారు ముక్త కంఠంతో వాళ్లు. వార్డెన్ పర్మిషన్తో బీచ్‌కు తీసుకెళ్లారు. చీకటి పడేవరకు ఆడుకున్నారు. అక్కా, అన్నా అంటూ ఈ ఇద్దరితో సరదాగా గడిపారు. కావల్సింది కొనిపించుకున్నారు. అలసిసొలిసి సంతోషంగా ఆర్ఫనేజ్‌కు చేరారు. ఈ సంఘటనలను బట్టి ఇప్పుడున్న డేటింగ్ ట్రెండ్ అర్థం అవుతోంది కదా! పెళ్లి బంధంలోకి వెళ్లాలనుకునే ప్రేమికులు.. తమ మధ్య ఉన్న కంపాటబులిటీని అర్థం చేసుకోవడానికి, పెంచుకోవడానికి డేటింగ్ చేస్తారు.. స్నేహం పెరగడానికి డేట్‌కి వెళ్తారు. తెలిసిన విషయమే. కొత్త ఒరవడే.. డేట్ విత్ పేరెంట్స్, సిబ్లింగ్స్, కజిన్స్.. ఫ్రెండ్స్. ఒకే ఇంట్లో ఉంటున్నా వాట్సప్‌లో విష్ చేసుకునే కాలం ఇది. కారణం.. గడియారంతో పోటీ పడే వేగం.. ఉదయం లేవగానే చాయ్‌తో చర్చించే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఉన్న నలుగురికీ కలిసి భోంచేసే భాగ్యం కరువవడం, అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడితో ముఖాముఖి మాట్లాడుకోవడానికి వీలుపడకపోవడం కావచ్చు. ఇక కజిన్స్.. ఫ్రెండ్స్.. సంగతి చెప్పక్కర్లేదు. ఆ అందరిదాకా ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్, క్లయింట్స్‌తో అర్జెంట్ మీటింగ్స్ లాంటి ఎక్స్ట్రా ఫిటింగ్స్‌తో మనతో మనం గడిపే టైమూ దొరకట్లేదు అని వాపోతున్న వాళ్లూ చాలామందే! ఈ చాలామంది సోషల్ మీడియా ఫ్రీకే! అయినా వాపోతున్నారంటే.. రిలేటివ్స్, రిలేషన్స్‌కు మధ్య ఉన్న ఆర్టిఫీషియల్ కనెక్టివిటీని తొలగించుకోవాలనుకుంటున్నట్టే కదా! కనిపిస్తూ.. వినిపించే పకరింపు.. భరోసానిచ్చే కరచాలనం.. ఆప్యాయతను చూపించే ఆలింగనం.. బంధాన్ని, అనుబంధాన్ని బలపరిచే ఆత్మీయ స్పర్శ.. ఒకరికొకరం ఉన్నామనే భద్రతను కోరుకుంటున్నట్టే కదా! ఇవన్నీ పొందడానికి కనీసం వారానికి ఒక్కరోజు దొరికినా చాలు అని ఎదురుచూస్తున్నారు. అందుకే ఆ కొత్త ట్రెండ్ వచ్చింది. డేట్ విత్ పేరెంట్స్, తోబుట్టువులు, కజిన్స్, ఫ్రెండ్స్‌తోనే కాదు.. మనతో ఉండే రోజు ! అనూష తివారి మియామీ.. గోవా.. నేను నాకు ఏ మాత్రం టైమ్ దొరికినా నాకిష్టమైన చోటుకి వెళ్లి.. నాతో నేను డేట్ చేయాలనుకుంటాను. వెళ్లాను.. వెళ్తాను కూడా. అమెరికాలో ఉన్నప్పుడు మియామీ.. ఇండియాలో గోవా. మనతో మనం గడిపితే.. మన మైనస్ పాయింట్స్ తెలుస్తాయి.. మన స్ట్రెంత్ అర్థమవుతుంది. కొత్త ఎనర్జీ వస్తుంది.– అనూష తివారి,ప్రాజెక్ట్ మేనేజర్ (డెలాయిట్) సండే.. ఫ్యామిలీ డే మా పేరెంట్స్ ఇద్దరూ వర్కింగే. నేను, నాకో చెల్లి. కాలేజ్‌తో మేమూ బిజీ. సో... వారానికి ఒక రోజు డేట్ విత్ ఫ్యామిలీ అన్నమాట. ఎవ్రీ సండే.. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు బయటే స్పెండ్ చేస్తాం. చర్చ్, పిక్చర్.. కంపల్సరీ. మిగిలిన విజిటింగ్ ప్లేసెస్ మారుతుంటాయి.. ఒక్కో సండే ఒక్కోచోటికి.– రితిక, బీటెక్స్టూడెంట్, హైదరాబాద్ డైన్ విత్ పేరెంట్స్ మా నాన్న (పర్వతాలు) అడ్వకేట్. అమ్మ (హైమలత).. హోమ్ మేకర్. నేనొక్కడినే కొడుకును. రీసెంట్గా బీటెక్ అయిపోయింది. వర్క్‌తో నాన్న బిజీగా ఉంటాడు. అమ్మ నాకోసం ఆరాటపడ్తుంది. కాని ఫ్రెండ్స్, పార్టీలతో నేను అమ్మకు దొరకను. చాలాసార్లు అనుకుంటా అమ్మతో టైమ్ స్పెండ్ చేయాలని. కనీసం నా బర్త్‌డే రోజైనా ఇంట్లో అమ్మతో సెలబ్రేట్ చేసుకోవాలని. మొన్న ఎయిటీంత్(జూలై 18)నే నా బర్త్‌డే అయింది. ఆ రోజు ఇంట్లోనే ఉండాలని అనుకున్నా. కాని ఫ్రెండ్స్ పార్టీ అనేసరికి వెళ్లాల్సి వచ్చింది. అమ్మ చాలా బాధ పడింది. ఇప్పటి నుంచి అలా ఉండకూడదనుకుంటున్నా. కనీసం వారంలో ఒక్కరోజైనా మా పేరెంట్స్‌తో గడపాలి. బయటకు వెళ్లడం కుదరకపోతే కనీసం వాళ్లతో కలిసి భోజనమన్నా చేయాలి. ఐ మీన్ డైన్ విత్ పేరెంట్స్ అన్నమాట. ఈ సారి పక్కా!– రాహుల్ యాదవ్, హైదరాబాద్ రాహుల్ యాదవ్, రితిక 60వ పుట్టినరోజే ఫస్ట్ డేట్.. ఎనిమిదేళ్లు అమెరికా (కాలిఫోర్నియా)లో ఉన్నాను. యాపిల్‌లో వర్క్ చేసేదాన్ని. మొన్ననే ఇండియా షిఫ్ట్ అయ్యాను. మా పేరెంట్స్‌తో గడపాలనే ఉద్దేశంతోనే. ఇంతకన్నా పెద్ద డేట్ ఉండదేమో కదా (నవ్వుతూ). నాన్న (ఏ.ఎస్. రామశాస్త్రి).. ఐడిబీఆర్టీ డైరెక్టర్. అమ్మ (ఏ. గాయత్రీదేవి).. ఆయుర్వేదిక్ డాక్టర్. వాళ్ల బిజీతో నా దగ్గరకు రాలేకపోయేవారు. లీవ్స్ లేక ఇండియాకు రావడం నాకూ కష్టమయ్యేది. పేరెంట్స్‌ని చాలా మిస్ అయ్యా. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలి వచ్చేశా. నేనొచ్చాక వాళ్లతో నా ఫస్ట్ డేట్ మా నాన్నగారి 60వ పుట్టినరోజు. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరి దగ్గరా నాన్న గురించి కామెంట్స్, జ్ఞాపకాలు తీసుకొని పుస్తకంగా పబ్లిష్ చేయించా. ఆ పుస్తకాన్ని నాన్నకు సర్ప్రైజ్ గిఫ్ట్‌గా ఆయన బర్త్‌డే ఫంక్షన్లో లాంచ్ చేశాం. ఆ రోజంతా అమ్మా, నాన్న.. వాళ్ల స్నేహితులతో గడిపా. ఇప్పటికీ ఏ రోజు టైమ్ దొరికినా వాళ్లకు ఇష్టమైనవి వండిపెడ్తా. ముగ్గురం కలిసే భోంచేస్తాం.. ఇష్టమైన సినిమా చూస్తాం.. కబుర్లు చెప్పుకుంటాం.– ఏ. అపరాజిత, ఇండిపెండెంట్ కన్సల్టెంట్. సందర్భం క్రియేట్ చేసుకుంటున్నాం.. పెళ్లయిన ఆడపిల్లలకు తోబుట్టువులను కలుసుకోవాలన్నా ఒక అకేషన్ ఉండాలి.. అత్తింట్లో పర్మిషన్ ఉండాలి. అందుకే సిబ్లింగ్స్ అండ్ కజిన్స్‌ను కలుసుకునే సందర్భాన్ని క్రియేట్ చేసుకొని ఆ డేను డేట్ విత్ సిబ్లింగ్స్ అండ్ కజిన్స్‌గా ఎంజాయ్ చేస్తున్నాం.– ఏలేటి రమ్య, దుబాయ్ అమ్మానాన్నలతో అపరాజిత మనం ఉండే రోజు ! దీని గురించి విన్న పెద్ద తరం ‘‘ఏంటో ఉన్నదాన్ని నాశనం చేసుకొని.. మళ్లీ దాన్ని నిలబెట్టుకునే వెర్రి ప్రయత్నాల పిదప కాలం.. పిదప బుద్ధులు కాకపోతే?’’ అంటూ పెదవి విరవొచ్చు. ‘‘ముందు ఓల్డేజ్ హోముల్లో పెట్టిన మమ్మల్ని ఇంటికి తెచ్చుకోండి’’ అంటూ నొసలు చిట్లించనూ వచ్చు! దొరికన ఒక్కరోజైనా అయిన వాళ్లతో డేట్కెళ్లే హడావుడిలో ఉంది యూత్! ఆ లిస్ట్‌లో ఓల్డేజ్ హోమ్‌లోని గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి పాశ్చాత్య పైత్యం.. ఫ్యాషన్ ప్రకోపం అంటూ వాళ్ల మనసుల్ని చిన్నబుచ్చకుండా.. కనీసం ఈ కొత్త తీరుగానైనా పాత పద్ధతిని తిరిగి నిలబెట్టుకునే యత్నం చేస్తున్నందుకు పెద్ద మనసుతో ఆనందపడదాం!– సరస్వతి రమ -
పోర్చుగల్‌లో ఫ్యామిలీతో
కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్‌బాబు. ‘మహర్షి’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్ ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్ చుట్టి రానున్నారు మహేశ్. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేశ్ సతీమణి నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని ఫొటోలు. -
హాలిడే జాలిడే
తీరిక లేకుండా పని చేయడం. తీరికగా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయడం మహేశ్‌బాబు స్టైల్. తాజాగా ‘మహర్షి’ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారాయన. సినిమా ప్రమోషన్స్‌లో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఇప్పుడు వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకొని హాలిడేకు వెళ్లారని తెలిసింది. ఈ హాలిడేలో పోర్చుగల్, ఇంగ్లాండ్ దేశాలు చుట్టి వస్తారట. ముందు పోర్చుగల్‌లో హాలిడే ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటిస్తారట. జూన్ 15 మళ్లీ ఇండియా తిరిగి రానున్నారని తెలిసింది. వచ్చే నెల మొదట్లో ఇంగ్లాండ్‌లో ప్రపంచకప్ స్టార్ట్ కానుంది. అక్కడ ఇండియా మ్యాచ్‌లను మహేశ్ చీర్ చేస్తారేమో చూడాలి. తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు మహేశ్. -
కాంగ్రెస్ సహా ప్రతిపక్షం చేతులెత్తేసింది
కురుక్షేత్ర/ఫతేహాబాద్/న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఐదు దశలు పూర్తయ్యేసరికే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని తేలిపోయిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన హరియాణాలోని కురుక్షేత్ర, ఫతేహాబాద్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ప్రజల ఆశీర్వాదంతో మే 23వ తేదీ సాయంత్రం వెలువడే ఎన్నికల ఫలితాలతో మోదీ ప్రభుత్వం మరోసారి ఏర్పాటవ్వడం ఖాయమని తేలిపోయింది. కేంద్రంలో బలహీన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు విఫలమవడంతో కాంగ్రెస్, దాని అవినీతి కూటమి పార్టీలు చేతులెత్తేశాయి’ అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ‘అవినీతి పంట’ పండించింది.. గత కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధరకే రైతుల భూములను లాగేసుకుని అవినీతి పంట పండించిందని, అందుకు హరియాణానే రుజువని ప్రధాని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి నేతలందరినీ జైళ్లకు పంపడం ఖాయమని కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం భూపీందర్ హుడా, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వీధివీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ‘పాకిస్తాన్ అంటే కాంగ్రెస్‌కు ఎంతో ప్రేమ. దేశం సుభిక్షంగా ఉండటం పాక్ పుణ్యమేనంటుంది. రక్షణ విధానం బలహీనంగా ఉన్న ఏ దేశమైనా అగ్రదేశమవుతుందా? తనను తాను రక్షించుకోలేని దేశం మాట ఇతర దేశాలు వింటాయా?’ అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. సిక్కు వ్యతిరేక దాడులతో సంబంధమున్న ఓ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ సీఎంగా చేసిందని, పరోక్షంగా కమల్నాథ్నుద్దేశిస్తూ అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో వీధికో కాంగ్రెస్ నేత విగ్రహం ఏర్పాటు చేసుకున్న గత కాంగ్రెస్ ప్రభుత్వాలు, అమర సైనికులకు స్మృతిచిహ్నం ఒక్కటి కూడా నిర్మించలేకపోయాయన్నారు. నా తల్లిని కూడా దూషించారు ‘ప్రేమ పదకోశం(లవ్ డిక్షనరీ)నుంచి సేకరించిన తిట్లతో నిత్యం తనను దూషించే కాంగ్రెస్ పార్టీ నేతలు.. తన తల్లిని కూడా వదల్లేదని ప్రధాని విమర్శించారు. ‘వారి అవినీతిని అడ్డుకుని, దొరతనాన్ని ప్రశ్నించినందుకే ప్రేమ ముసుగు వేసుకుని హిట్లర్, దావూద్ ఇబ్రహీం, ముస్సోలినీ, ఔరంగజేబ్ కంటే క్రూరుడు, పిచ్చికుక్క, కోతి..ఇలా రకరకాల పేర్లతో నన్ను తిడుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ నా తల్లినీ వారు దూషించారు. నా తండ్రి ఎవరని ఆమెను అడిగారు. ఈ నిందలన్నీ నేను ప్రధాని పదవిని చేపట్టాక చేసినవే’ అని మోదీ పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వం వృథా.. ‘ఏ పనీ చేయని సర్కారుకు ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వమే ఉదాహరణ. తమను తాము మార్చుకోలేని వాళ్లు దేశాన్ని మార్చుతామంటూ అధికారంలోకి వచ్చారు. చిల్లర ముఠాలను బలపరుస్తూ దేశానికి శత్రువులను పెంచుతున్నారు’ అన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను ఢిల్లీ ఆస్పత్రుల్లో అమలు చేయనందుకే ఆప్ ప్రభుత్వాన్ని ఉపయోగం లేని(నాకామ్ పంతి) ప్రభుత్వంగా మోదీ అభివర్ణించారు. మావోలు, వేర్పాటు వాదులను సమర్ధించే వారిని మోదీ తరచూ చిల్లర (టుక్డేటుక్డే)గ్యాంగ్‌గా పేర్కొనడం తెల్సిందే. ఐఎన్ఎస్ విరాట్‌ను ట్యాక్సీలా వాడారు! రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని మోదీ ఆరోపించారు. ‘రాజీవ్‌గాంధీ, ఆయన బావమరుదుల కుటుంబాలు కలిసి పది రోజుల విహారయాత్రకు బయలుదేరారు. ఆ యాత్రకు దేశ ప్రాదేశిక సముద్ర జలాల్లో గస్తీ కోసం వినియోగించే ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీ మాదిరిగా వాడుకున్నారు. విరాట్’పై హెలికాప్టర్‌ను సైతం నేవీ సిద్ధంగా ఉంచింది. విరాట్‌తోపాటు వారంతా ఒక దీవిలో పది రోజుల పాటు ఆగారు. విదేశీయులను యుద్ధ నౌకలో తీసుకెళ్లడం ద్వారా దేశ భద్రత విషయంలో రాజీ పడలేదా అనేదే నా ప్రశ్న. ఐఎన్ఎస్ విరాట్‌ను 1987లో భారత నేవీలోకి తీసుకోగా 2016లో విధుల నుంచి తొలగించారు. -
విదేశాల్లో వేడుకలు!
గత ఐదేళ్లతో పోలిస్తే సినిమాల విషయంలో రజనీకాంత్ ఈ ఏడాది స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. ‘కాలా, 2.ఓ’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తేవడమే కాకుండా ‘పేట్టా’ అనే మరో సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసి ఈ ఏడాదిని బిజీ బిజీగా గడిపారు రజనీకాంత్. అందుకే ఇప్పుడు ఆయన హాలీడేను ప్లాన్ చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. ఫ్యామిలీతో కలిసి రజనీ న్యూయార్క్ వెళ్లారన్నది తాజా సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను రజనీ కుటుంబం అక్కడే జరుపుకుంటుందట. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘పేట్టా’ ప్రమోషన్ కోసం జనవరి మొదటివారంలో రజనీ ఇండియాకి తిరిగొస్తారని టాక్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘పేట్టా’. తెలుగులో ‘పేట’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో త్రిష, సిమ్రాన్ కథానాయికలుగా నటించారు. విజయ్ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మాళవిక మోహనన్ నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. రజనీకాంత్ నెక్ట్స్ మూవీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
ఇట్స్ ఫ్యామిలీ టైమ్
‘ఉన్న ఒక్క లైఫు.. గాలి పటం టైపు.. ఎగిరితేనే సంబరం. ఓసారి ట్రై చేయ్...’ అంటూ ‘నేల టిక్కెట్టు’ చిత్రంలో జీవితంలోని ప్రతీ మూమెంట్‌ని ఆనందంగా ఎలా గడపాలో చెప్పారు రవితేజ. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి అలానే ఎంజాయ్ చేస్తున్నారాయన. ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న రవితేజ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ‘ఇట్స్ ఫ్యామిలీ టైమ్’ అన్నారు. పిల్లలు మహాధన్, మోక్షదలతో కలసి బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లారు. ‘‘ఈ ఆనందపు క్షణాలే జీవితకాలపు జ్ఞాపకాలు’’ అంటూ పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రవితేజ. -
మహేశ్ ఫ్యామిలీ@డిస్నీల్యాండ్!
డిస్నీల్యాండ్ మాత్రమే కాదు... టుమారోల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటివి ఎన్నో... పిల్లలు ఎంజాయ్ చేసే ఎమ్యూజ్మెంట్ పార్కులు, మంచి మంచి ప్లేసులను హాలిడే ట్రిప్‌లో మహేశ్‌బాబు ఫ్యామిలీ కవర్ చేస్తున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతున్నారట! స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని ప్లేసులకు బై రోడ్ వెళ్లారట! మహేశ్ ఫ్యామిలీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఫ్యామిలీ ఈ ట్రిప్‌కి వెళ్లారని తెలుస్తోంది. మహేశ్ కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితారలు నవీన్ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. ఇక్కడున్న ఫొటోలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ యాడ్ షూటింగ్ కోసం మహేశ్ అమెరికా వెళ్లారు. ఆయనతో పాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. నవీన్ ఎర్నేని ఫ్యామిలీ కూడా వెళ్లడం, అక్కడ రెండు కుటుంబాలూ ఎంజాయ్ చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇండియా వచ్చేస్తారట! వచ్చీ రాగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న షూటింగ్‌తో మహేశ్ బిజీ అవుతారు. -
సల్మాన్ ఖాన్ విహార యాత్ర
కులుమనాలి: సినిమాలతోపాటు కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(50) ఒకరు. ప్రస్తుతం దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కిస్తున్న ‘ట్యూబ్ లైట్’ సినిమా షూటింగ్ లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. షూటింగ్ లో కాస్త విరామం దొరకగానే ఆయన కుటుంబంతో కలిసి బియాస్ నది అందాలను తిలకిస్తూ తెప్ప బోటులో రైసన్ గ్రామం నుంచి కులుమనాలి టౌన్ వరకు దాదాపు 14 కి.మీ గంటన్నర పాటు ప్రయాణించారు. ఈ ఫోటోలు ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘ట్యూబ్ లైట్’ సినిమా చైనా, భారత్ యుద్ధం ఇతివృత్తం ఆధారంగా కబీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో చైనా నటి ఝు ఝు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇందులో సల్మాన్ విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా 2017 లో విడుదలకానుంది. -
కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 5వ తేదీ వరకూ చంద్రబాబు వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. అయితే సీఎం పర్యటన వివరాలను టీడీపీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. చంద్రబాబు పర్యటనకు ఎక్కడికి వెళ్లారో కూడా తమకు తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా గతంలోనూ చంద్రబాబు దాదాపు 5 రోజులపాటు కుటుంబంతో ఎంజాయ్ చేశారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు.. ఏ దేశంలో పర్యటించారు.. ఎక్కడ విడిది చేశారనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. సాధారణంగా చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళితే మీడియాలో బాగానే కవరేజ్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశీ పర్యటనల సమయంలో ఛానల్స్, పత్రికలకు సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ పర్యటనను కూడా చంద్రబాబు గోప్యంగా ఉంచారు. -
టెన్షన్ లేనిటూర్
దసరా సెలవులు సమీపిస్తున్నాయి... ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకోవడం సహజం. కానీ, రైల్వే, విమాన టికెట్ల రిజర్వేషన్, వీసా మొదలు... గైడు, చూడాల్సిన ప్రదేశాల ఎంపిక, భోజనం, వసతి ఏర్పాట్లు కష్టమే. వీటికి భయపడే చాలా మంది తమ టూర్లు రద్దు చేసుకుంటారు. అరుుతే.. ఇప్పుడు అలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకునే టూర్ సర్వీసెస్ వరంగల్ నగరంలో విస్తరిస్తున్నాయి. ఒక్కటేమిటి... అన్ని రకాల సేవలను ఆయూ సంస్థలే బాధ్యతగా తీసుకుంటున్నారుు. ఇక మీరు చేయూల్సిందల్లా... ఎమౌంట్ చెల్లించడమే. సాక్షి, హన్మకొండ :తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్యాలకు వాహనాలు నడిపించడమే గతంలో టూర్ సర్వీసెస్‌గా ఉండేది. ఇప్పుడు బస్సులో తీసుకెళ్లడమే కాదు.. అక్కడ బ్రేక్ దర్శనాలు కూడా చేరుుస్తున్నారు. హానీమూన్ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. పెళ్లి, విహారయాత్రలకు వాహనాలు సమకూర్చడం ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న అంశంగా మారింది. యాత్ర ప్రత్యేకతలను తెలిపే గైడ్ల నుంచీ... వసతి, భోజన, దర్శన, వీసా, టికెట్ల వంటి ఏర్పాట్లు చేసే సంస్థలు వెలిశారుు. ఈ సర్వీసెస్ వరంగల్‌లో అందుబాటులోకి రాగా... ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టూర్ ఏదైనా సరే.. విద్యార్థులు వెళ్లే ఎడ్యుకేషనల్ టూర్స్, ఫ్యామిలీస్ వెళ్లే పుణ్యక్షేత్రాల దర్శనం, కొన్ని కుటుంబాలు కలిసి చేసే ఆథ్యాత్మిక యాత్రలు, కార్పొరేట్ కంపెనీలు ఏర్పాటు చేసే రిఫ్రెష్మెంట్ టూర్స్, సింగిల్‌గా వెళ్లే ఎడ్వెంచర్స్ టూర్, కొత్తగా పెళ్లైన జంటలకు హానీమూన్... ఇలా ఏదైనా సరే అన్నీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. టూర్ బుక్ చేసుకుని ఎమౌంట్ చెల్లిస్తే చాలు. ఆ తర్వాత ఎలాంటి టెన్షన్స్ లేకుండా టూర్‌ని ఎంజాయ్ చేయడమే యాత్రికులకు మిగిలిన పని. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే విదేశాల్లో వీసా ఇప్పించడం వరకు అన్ని బాధ్యతలను ఈ సంస్థలే తీసుకుంటున్నారుు. సేవలు ఎలా అంటే.. ముందుగా సదరు వ్యక్తులు ఎక్కడికి వెళతారో... సంస్థలో బుక్ చేసుకోవాలి. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు రైలు, బస్సు, విమానం టికెట్లు బుక్ చేసి ఇస్తారు. ఆ తర్వాత వరంగల్ నుంచి బయల్దేరి గమ్యస్థానం చేరిన వెంటనే అక్కడ ఈవెంట్ మేనెజ్మెంట్ సంస్థకు సంబంధించిన బాధ్యులు యాత్రికులను పికప్ చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం 3 స్టార్, 4 స్టార్ హోటళ్లలో వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు. అనంతరం దర్శనీయ స్థలాలు చూసేందుకు వాహనం, గైడ్, అనుమతి తదితర పనులన్నీ వీరే చక్కబెడతారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే బ్రేక్ దర్శనం ఏర్పాట్లు కూడా ఈ సర్వీస్ సంస్థకు చెందిన బాధ్యులే తీసుకుంటారు. యాత్ర మొత్తం పూర్తయిన తర్వాత తిరిగి వరంగల్ చేరే వరకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు ఎడ్యుకేషన్ టూర్లో భాగంగా విద్యార్థులకు జిల్లాలో హన్మకొండలోని వేయిస్తంబాలగుడి, భద్రకాళి టెంపుల్, ఖిలావరంగల్, లక్నవరం, రామప్ప ప్యాకేజ్ టూర్ అందుబాటులో ఉంది. ఈ ప్రదేశాల దర్శనంతో పాటు లంచ్, స్నాక్స్ కూడా అందిస్తారు. ఇవి కాకుండా ఎడ్యుకేషన్ టూర్లో మైసూర్, బెంగళూరు, కన్యాకుమారి ప్యాకేజీలూ ఉన్నాయి. ఈ ప్యాకేజీకి కనీసం 50 మంది విద్యార్థులు ఉండాలి. ప్రకృతి, పుణ్యక్షేత్రం ప్యాకేజీలో భద్రాచలం అందుబాటులో ఉంది. ఇక షిర్డీ, వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాలకు సంబంధించి మూడు పగళ్లు, నాలుగు రాత్రుల ప్యాకేజీకి అన్ని ఖర్చులు కలిపి ఒక్కరికి రూ. 6000 వరకు చార్జ్ వేస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలకు సంబంధించి కేరళకు హనీ మూన్ ప్యాకేజీ ఉంది. ఇందులో ఐదు రాత్రులు, నాలుగు పగళ్లు కలిపి జంటకు రూ. 44,000 చార్జ్ తీసుకుంటున్నారు. బ్యాంకాక్ టూర్లో భాగంగా ఐదు పగల్లు, నాలుగు రాత్రులకు సంబంధించి ఒక్కరికి రూ. 44,000... ఖాట్మాం డు టూర్లో మూడు పగల్లు, నాలుగు రాత్రుళ్లకు సంబంధించి ఒక్కరికి రూ. 25,000 చార్జ్ వేస్తున్నారు. విదేశీ యాత్రల్లో తెలుగు భాష తెలిసిన గైడ్, ఇంగ్లిష్ భాష వచ్చిన క్యాబ్ డ్రైవర్లను సంస్థలే సమకూర్చుతారుు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అందిస్తున్న ప్యాకేజీలు (హైదరాబాద్ నుంచి) కాకతీయ హెరిటేజ్ ప్యాకేజ్ ( 2 డేస్, 2 నైట్స్) యాదగిరిగుట్ట, పెంబర్తి, జైన దేవాలయం, చేర్యాల పెయింటింగ్స్, ఖిలా వరంగల్, భద్రకాళి టెంపుల్, వేయిస్తంభాలగుడి, గణపురం కోటగుళ్లు, రామప్పదేవాలయం, ఏటూరునాగరాం అభయారణ్యం, లక్నవరం సరస్సులున్నాయి. ఒక్క యాత్రికుడికి టికెట్ ధర ఏసీ కోచ్ అయితే రూ. 3,000, నాన్ ఏసీ కోచ్‌కు రూ. 2,500. హిల్‌స్టేషన్ ప్యాకేజ్ (3 డేస్, 2 నైట్స్) అన్నవరం,బొర్రగుహాలు, అరకు, విశాఖపట్నం, భీమవరం, పాలకొల్లు, విజ యవాడ, ద్వారాకా తిరుమల ఉన్నా రుు. ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.4,000, నాన్ఏసీ కోచ్‌కు రూ. 3,500. టెంపుల్ ప్యాకేజీ (2 డేస్, 1 నైట్) వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, బాసర ప్యాకేజీకి ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ. 2,600, నాన్ ఏసీకి రూ.2,100. విహారయాత్ర (2 డేస్, 1 నోట్) భద్రాచలం, పాపికొండలు (బోటు జర్నీ). ఏసీ కోచ్ టికెట్ ధర ఒక్కరికి రూ.2,600, నాన్ ఏసీకి రూ. 2,100. ఆదరణ బాగుంది కొంత కాలం క్రితం వరకు ప్రైవేట్ బస్ సర్వీసెస్ ఉండే ఏనుగుల గడ్డ ప్రాంతమే నగరంలో టూరిస్ట్ సర్వీసెస్‌కి అడ్డా. కానీ, పోటీ ప్రపంచంలో అందరూ వివిధ వృత్తుల్లో బిజీ అవడంతో తీరిక లేకుండా ఉంటున్నారు. అందువల్లే పని ఒత్తిడి నుంచి బయట పడేందుకు టూర్స్‌కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే అక్కడ కూడా బస, వసతి ఇబ్బందులు ఉండొద్దని కోరుకుంటున్నారు. అందువల్లే టూరిస్ట్ సర్వీసెస్‌కి నగరంలో ఆదరణ పెరుగుతోంది. మేం సర్వీస్ ప్రారంభించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకాక్, ఖాట్మాండుల ప్యాకేజీలను ఇద్దరు టూరిస్టులు బుక్ చేసుకోవడం ఇక్కడున్న డిమాండ్‌ని తెలియజేస్తుంది. మా సర్వీసెస్ కావాలనుకునే వారు 97009 99786 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. - ప్రదీప్, హ్యాపీడేస్-హాలీడేస్ మేనేజర్ విదేశాలకు వెళ్లేవారు పెరిగారు గతంలో యాత్రలు అంటే తిరుపతి, వేములవాడ, కాళేశ్వరం.. లేదంటే చార్ధామ్ యాత్ర అన్నట్లుగానే ఉండేది. కానీ గడిచిన ఐదేళ్లలో నగరంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మర్ వెకేషన్స్‌కి ఎక్కువ మంది కులూమనాలి, సిమ్లా, గోవా, ఊటీలకు వెళ్తున్నారు. ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా కేరళ... లేదంటే బ్యాంకాక్, పుకెట్ ఐలాండ్ వంటి దీవులకు వెళ్తున్నారు. గతంలో ఈ సర్వీస్‌ల కోసం హైదరాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు నగరంలో అందిస్తుండటంతో వెకేషన్స్‌కి విదే శాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. - నవీన్, శ్రీజా ట్రావెల్స్ మేనేజింగ్ డెరైక్టర్