![Ravi Teja Vacation With Son and Daughter in Bangkok - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/12/raviteja345.jpg.webp?itok=wv_IuRP1)
పిల్లలు మోక్షద, మహాధన్‌లతో రవితేజ
‘ఉన్న ఒక్క లైఫు.. గాలి పటం టైపు.. ఎగిరితేనే సంబరం. ఓసారి ట్రై చేయ్...’ అంటూ ‘నేల టిక్కెట్టు’ చిత్రంలో జీవితంలోని ప్రతీ మూమెంట్‌ని ఆనందంగా ఎలా గడపాలో చెప్పారు రవితేజ. ప్రస్తుతం ఫ్యామిలీతో కలసి అలానే ఎంజాయ్ చేస్తున్నారాయన. ఒకేసారి రెండు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న రవితేజ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి ‘ఇట్స్ ఫ్యామిలీ టైమ్’ అన్నారు. పిల్లలు మహాధన్, మోక్షదలతో కలసి బ్యాంకాక్ ట్రిప్‌కు వెళ్లారు. ‘‘ఈ ఆనందపు క్షణాలే జీవితకాలపు జ్ఞాపకాలు’’ అంటూ పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment