![Madhuri Dixit Shares Pictures From Her Vacation In Maldives With Her Family - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/5/madhu-1.jpg.webp?itok=fllcFNTL)
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్‌లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్‌క్రీమ్‌తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ.
కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్
మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు...
Comments
Please login to add a commentAdd a comment