ఆ సినిమా షూటింగ్‌లో ఏడ్చిన హీరోయిన్‌.. చివరకు తప్పలేదు! | Ranjeet: Madhuri Dixit Cried and Refused to Do Molestation Scene in Prem Pratigya | Sakshi
Sakshi News home page

Madhuri Dixit: ఆ సీన్‌ చేయనని ఏడ్చేసిన హీరోయిన్‌.. విలన్‌గా అది తప్పదన్న నటుడు

Published Thu, Apr 4 2024 12:52 PM | Last Updated on Thu, Apr 4 2024 1:34 PM

Ranjeet: Madhuri Dixit Cried and Refused to Do Molestation Scene in Prem Pratigya - Sakshi

ఎందుకింత ఆలస్యం చేస్తున్నారా? అని అనుకుంటూ ఉండగా ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌ తను ఏడుస్తుందని చెప్పాడు. అతడొక బెంగాలీవాసి. మా డైరెక్టర్‌ పేరు బాపు. తను దక్షిణాది

ఒక్కసారి ఇండస్ట్రీలో అడుగుపెట్టాక కొన్ని ఇష్టం ఉన్నా, లేకపోయినా చేయక తప్పదు. అలా హీరోయిన్‌ మాధురి దీక్షిత్‌ గతంలో ఒక అత్యాచార సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ ఆ సీన్‌ చేయడం ఇష్టం లేక ఆమె ఎంతగానో ఏడ్చిందట! ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ విలన్‌ రంజీత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రంజీత్‌ మాట్లాడుతూ.. 'ప్రేమ్‌ పరిత్యాగ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆరోజు అత్యాచార సీన్‌ చిత్రీకరించాలి. నేను రెడీగా ఉన్నాను.

ఎందుకింత ఆలస్యం?
ఇంతలో మాధురి ఆ సీన్‌ చేయనని ఏడుస్తూ ఉందట. ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారా? అని అనుకుంటూ ఉండగా ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌ తను ఏడుస్తుందని అసలు విషయం చెప్పాడు. అతడొక బెంగాలీవాసి. మా డైరెక్టర్‌ పేరు బాపు. తను దక్షిణాది ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇకపోతే సినిమాలో మాధురి తండ్రి చాలా పేదవాడు. తోపుడుబండి నడుపుతూ ఉంటాడు. ఆ బండిపైనే హీరోయిన్‌తో నా సీన్‌ చిత్రీకరించాల్సి ఉంది. చాలాసేపటి తర్వాత ఆమె ఆ సీన్‌ చేసేందుకు ఒప్పుకుంది.

కట్‌ చెప్పకుండా..
ఫైట్‌ మాస్టర్‌ వీరు దేవ్‌గణ్‌.. ఎక్కడా సీన్‌కు కట్‌ చెప్పకుండా చూసుకోండి.. మేము కెమెరాను తిప్పుతూనే ఉంటామని చెప్పాడు. అత్యాచార సన్నివేశాల్లో నటించడమనేది మా పని. కానీ విలన్లమైన మేము మరీ అంత చెడ్డవాళ్లమైతే కాదు' అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రేమ్‌ పరిత్యాగ్‌ 1989లో రిలీజైంది. మిథున్‌ చక్రవర్తి, మాధురి దీక్షిత్‌, రంజీత్‌ సహా దివంగత నటులు వినోద్‌ మెహ్రా, సతీశ్‌ కౌశిక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రంజీత్‌ విషయానికి వస్తే ఈయన కెరీర్‌లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు.

చదవండి: తొలిసారి తండ్రి ఫోటోను షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement