
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శనివారం) ఉదయం తాడేపల్లి రానున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఈనెల 17న కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లిన విషయం తెలిసిందే.
దాదాపు 13 రోజుపాటు అక్కడ కుటుంబంతో కలిసి గడిపారు. నేటి రాత్రి లండన్ నుంచి తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం 4.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు.