
సాక్షి బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. లండన్ నుంచి వైఎస్ జగన్ దంపతులు శుక్రవారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి నగరంలోని తమ నివాసానికి వెళ్లారు.
విదేశీ పర్యటన ముగించుకుని జగన్ వస్తున్నట్లు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు జగన్ బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment