మహేశ్‌ ఫ్యామిలీ@డిస్నీల్యాండ్‌! | Mahesh Babu Family Latest Holiday Trip | Sakshi
Sakshi News home page

మహేశ్‌ ఫ్యామిలీ@డిస్నీల్యాండ్‌!

Published Sat, Nov 18 2017 1:16 AM | Last Updated on Sat, Nov 18 2017 1:58 AM

Mahesh Babu Family Latest Holiday Trip  - Sakshi - Sakshi - Sakshi

డిస్నీల్యాండ్‌ మాత్రమే కాదు... టుమారోల్యాండ్, హాలీవుడ్‌ స్టూడియో వంటివి ఎన్నో... పిల్లలు ఎంజాయ్‌ చేసే ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, మంచి మంచి ప్లేసులను హాలిడే ట్రిప్‌లో మహేశ్‌బాబు ఫ్యామిలీ కవర్‌ చేస్తున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు తిరుగుతున్నారట! స్పెషాలిటీ ఏంటంటే... కొన్ని ప్లేసులకు బై రోడ్‌ వెళ్లారట! మహేశ్‌ ఫ్యామిలీతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ ఎర్నేని ఫ్యామిలీ ఈ ట్రిప్‌కి వెళ్లారని తెలుస్తోంది.

మహేశ్‌ కుమారుడు గౌతమ్‌కృష్ణ, కుమార్తె సితారలు నవీన్‌ ఎర్నేని పిల్లలతో బాగా కలసిపోయారు. ఇక్కడున్న ఫొటోలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మహేశ్‌ అమెరికా వెళ్లారు. ఆయనతో పాటు నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. నవీన్‌ ఎర్నేని ఫ్యామిలీ కూడా వెళ్లడం, అక్కడ రెండు కుటుంబాలూ ఎంజాయ్‌ చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో ఇండియా వచ్చేస్తారట! వచ్చీ రాగానే కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న షూటింగ్‌తో మహేశ్‌ బిజీ అవుతారు.







 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement