ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్‌.. ఎమ్మెల్యే హఠాన్మరణం! | Shiv Sena MLA Ramesh Dies With Heart Attack At Dubai Family Trip | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్‌.. ఎమ్మెల్యే హఠాన్మరణం!

Published Thu, May 12 2022 2:17 PM | Last Updated on Thu, May 12 2022 2:17 PM

Shiv Sena MLA Ramesh Dies With Heart Attack At Dubai Family Trip - Sakshi

ముంబై: కుటుంబంతో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే.. దుబాయ్‌లో హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో అక్కడే ఆయన కన్నుమూశారు. మృతి చెందిన ఎమ్మెల్యేను మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే(52) గా గుర్తించారు. 

బుధవారం అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారు. ఆయన విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉంటే  ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. 

ముంబై అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్‌ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement