Shiv Sena MLA
-
నాకు ఓటేయకుంటే తిండి మానండి
ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి. -
Shiv Sena: శివసేన ఎమ్మెల్యే అనిల్ మృతి.. సీఎం షిండే దిగ్భ్రాంతి
ముంబై: మహారాష్ట్రలో సీనియర్ రాజకీయనాయకుడు, శివసేన ఎమ్మెల్యే అనిల్ బాబర్(74) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇక, ఆయన మృతిపట్ల సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, గత కొద్దిరోజులు అనిల్ బాబర్ అనారోగ్యం కారణంగా సంగ్లీ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఇక, అనిల్ మృతిపై సీఎం ఏక్నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షిండే.. బాబర్ మృతితో ఒక మార్గదర్శిని, సన్నిహితుడిని కోల్పోయినట్టు కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కోల్పోయిందన్నారు. అలాగే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని షిండే తెలిపారు. Shiv Sena MLA Anil Babar passes away at a hospital in Sangli district of Maharashtra. He was not keeping well for the last few days. Today's State cabinet meet has been cancelled. CM is leaving for Sangli to meet Babar's family. (Pic: Anil Babar's 'X' account) pic.twitter.com/EMLV24O271 — ANI (@ANI) January 31, 2024 మరోవైపు.. అనిల్ బాబర్ అకాల మరణం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అనిల్ మృతి పట్ల సంతాపం తెలియజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులను సీఎం షిండే పరామర్శించనున్నారు. ఈ క్రమంలో సంగ్లీలోని అనిల్ నివాసానికి షిండే వెళ్లనున్నారు. ఇక, అనిల్ బాబర్ ప్రస్తుతం సంగ్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్.. ఎమ్మెల్యే హఠాన్మరణం!
ముంబై: కుటుంబంతో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే.. దుబాయ్‌లో హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో అక్కడే ఆయన కన్నుమూశారు. మృతి చెందిన ఎమ్మెల్యేను మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే(52) గా గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారు. ఆయన విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. Shocked to hear the news of Shiv sena MLA Ramesh Latke’s sudden demise! I Remember meeting him on a flight to kokan for angnewadi jatra just few months back.. I praised him for losing so much weight because of dieting.. He was a friend beyond party lines.. Unbelievable!! RIP🙏🏻 — nitesh rane (@NiteshNRane) May 12, 2022 ముంబై అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు. Saddened and shocked to hear about the passing of Shri Ramesh Latke ji. His constant energy, his dedicated work during COVID & his connect with the constituency was immense. He will be missed& he has gone too soon. My heartfelt condolences to his family, friends and colleagues. — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) May 12, 2022 -
‘డమ్మీ’ ఎమ్మెల్యేపై దుమారం
ముంబై: ఎమ్మెల్యే పాల్గొనాల్సిన కార్యక్రమంలో ‘డమ్మీ’ ప్రత్యక్షం కావటంపై మహారాష్ట్రలో దుమారం రేగుతోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుతాన్ని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలివీ.. అధికార శివసేన ఇటీవల రైతులతో ముఖాముఖి ‘శివ్ సంపర్క్ అభియాన్’ చేపట్టింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు రాష్ట్రంలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడాల్సి ఉంది. కాగా, శివసేనకు చెందిన పింప్రిచించ్వాడ్ ఎమ్మెల్యే గౌతమ్ చబుకేశ్వర్ విహారయాత్రల్లో ఉన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తనకు కేటాయించిన మరాఠ్వాడ ప్రాంతంలోని ఒస్మానాబాద్ ప్రాంతంలో రైతులతో మాట్లాడాల్సి ఉండటంతో ఎమ్మెల్యే గౌతమ్ తరుణోపాయం కనిపెట్టారు. తన విహార యాత్రలకు భంగం కలుగకుండా ఉండేందుకు, పార్టీ ఉత్తర్వుల మేరకు తన తరఫున యశోధర్ ఫణసే అనే మాజీ కార్పొరేటర్‌ను పురమాయించారు. ఈ మేరకు యశోధర్ శివ్ సంపర్క్ అభియాన్‌లో పాల్గొన్నారు. తనకు తాను ఎమ్మెల్యే గౌతమ్ చబుకేశ్వర్‌గా పరిచయం చేసుకుని బాధ్యతలను నెరవేర్చారు. అయితే, ఈ విషయం ప్రతిపక్షాలు పసిగట్టాయి. పోలీసులు దీనిపై సుమోటొగా పరిగణించి ఎమ్మెల్యేపై మోసం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. అయితే చబుకేశ్వర్, ఫణసేలు ఈ ఆరోపణలను ఖండించారు. -
నచ్చిన సీటుకోసం 2000 మందికి నరకం
ముంబయి: తనకు నచ్చిన చోట సీటు ఇవ్వాలంటూ శివసేన పార్టీ ఎమ్మెల్యే అతడి అనుచరులు నానా రచ్చ చేశారు. చత్రపతి శివాజీ టర్మినస్ పై దాదాపు గంటసేపు ఎక్స్ ప్రెస్ రైలును ముందుకెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో దాదాపు 2000 మంది ప్రయాణీకులకు ఇబ్బంది కలిగినట్లయింది. నాందేడ్ ప్రాంతానికి చెందిన హేమంత్ పాటిల్ అనే ఎమ్మెల్యే దేవగిరి ఎక్స్ ప్రెస్ లో తనకు సెకండ్ ఏసీ కోచ్ లో పక్క సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రి పదిగంటల వరకు రైలు కదలకుండా అడ్డుకున్నారు. -
శివసేన ఎమ్మెల్యే హఠాన్మరణం
పాల్గార్: శివసేన ఎమ్మెల్యే కృశాన్ ఘొడా(61) హఠ్మానరణం చెందారు. గుండెపోటులో ఆదివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లా దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన ప్రాతనిథ్యం వహిస్తున్నారు. పాల్గార్ జిల్లాలో ఓ పెళ్లికి హాజరయి తిరిగి వస్తుండగా చరోటి చెక్ పోస్టుకు సమీపంలో తెల్లావారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే వాపి ప్రాంతంలోని హరియా ఆస్పత్రికి ఆయనను తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. కృశాన్ ఘోడా అంత్యక్రియలు ఆయన స్వగ్రామం రణషీత్ లో నిర్వహించనున్నారు. -
బట్టలూడదీసి కొడతా..!
ముంబై: బట్టలూడదీసి కొడతానంటూ ఓ మహిళకు వార్నింగ్ ఇచ్చాడనే ఆరోపణలపై శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ బాలా సావంత్‌పై కేసు నమోదైంది. బాంద్రా శివారు ప్రాంతాల్లోని ఓ హౌసిం గ్ సొసైటీ పునరాభివృద్ధి విషయమై జరిగిన వాగ్వాదంలో సహనం కోల్పోయిన సావంత్ ఈ వాఖ్యలు చేసినట్లు ఖేర్వాడీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుమేరకు సావంత్‌పై భారత శిక్షాస్మృతి, సెక్షన్లు 540(అవమాన పర్చాలనే ఉద్దేశంతో దుర్బాషలాడడం), 506 (బెదిరించడం), 509 (మహిళను కించపర్చడం) ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీని యర్ ఇన్స్పెక్టర్ అశోక్ కదమ్ తెలిపారు. గాంధీనగర్ హౌసింగ్ సొసైటీలో 36 హౌసింగ్ బోర్డ్ భవనాలున్నాయి. ఇక్కడ గత కొంతకాలంగా పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ హౌసింగ్ సొసైటీలో ఉన్న పలు సంఘాల మధ్య సఖ్యత కొరవడడం, అభివృద్ధి పనుల కోసం బిల్డర్‌ను ఎంపిక చేసే విషయంలో ఇరు గ్రూపుల మధ్య విభేదాలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి. ఇదే హౌసింగ్ సొసైటీలో ఎమ్మెల్యే కూడా ఉంటున్నారు. కాగా సోమవారం బాధితురాలిని పిలిచి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు లు నిజానిజాల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కదమ్ చెప్పారు.