ముంబై: మహారాష్ట్రలో సీనియర్ రాజకీయనాయకుడు, శివసేన ఎమ్మెల్యే అనిల్ బాబర్(74) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఇక, ఆయన మృతిపట్ల సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కాగా, గత కొద్దిరోజులు అనిల్ బాబర్ అనారోగ్యం కారణంగా సంగ్లీ జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం కన్నుమూశారు. ఇక, అనిల్ మృతిపై సీఎం ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షిండే.. బాబర్ మృతితో ఒక మార్గదర్శిని, సన్నిహితుడిని కోల్పోయినట్టు కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కోల్పోయిందన్నారు. అలాగే, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని షిండే తెలిపారు.
Shiv Sena MLA Anil Babar passes away at a hospital in Sangli district of Maharashtra. He was not keeping well for the last few days. Today's State cabinet meet has been cancelled. CM is leaving for Sangli to meet Babar's family.
— ANI (@ANI) January 31, 2024
(Pic: Anil Babar's 'X' account) pic.twitter.com/EMLV24O271
మరోవైపు.. అనిల్ బాబర్ అకాల మరణం నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన మహారాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. అనిల్ మృతి పట్ల సంతాపం తెలియజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులను సీఎం షిండే పరామర్శించనున్నారు. ఈ క్రమంలో సంగ్లీలోని అనిల్ నివాసానికి షిండే వెళ్లనున్నారు. ఇక, అనిల్ బాబర్ ప్రస్తుతం సంగ్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment