ముంబై: తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే రెండు రోజులపాటు అన్నం మానేయాలంటూ మహారాష్ట్రలో అధికార శివసేన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతోష్ బంగార్ చిన్నారులకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో చిన్నారులను ఉపయోగించుకోరాదంటూ ఎన్నికల కమిషన్ ఇటీవలే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే.
బంగార్ ఇటీవల ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పదేళ్లలోపు చిన్నారులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరేమీ తినకుండా ఉంటే ఏమైందని అమ్మానాన్న అడుగుతారు. బంగార్‌కే ఓటేయండి. అప్పుడే తింటాం అని చెప్పండి’’ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే ఓటేయాలని తల్లిదండ్రులకు చెబుతామంటూ పిల్లలతో వల్లె వేయించారాయన. దీనిపై విపక్షాలన్నీ మండిపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment