ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌ ప్లాన్‌ చేసిన సూపర్‌స్టార్‌! | Mahesh Babu Family Trip To Europe | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ వాయిదా.. ఫ్యామిలీతో మహేశ్‌బాబు హాలీడే ట్రిప్‌!

Published Sat, Apr 29 2023 3:58 AM | Last Updated on Sat, Apr 29 2023 6:26 AM

Mahesh Babu Family Trip To Europe - Sakshi

ఇటీవల ఫ్యామిలీతో కలిసి ప్యారిస్, జర్మనీకి హాలిడే ట్రిప్‌కు వెళ్లొచ్చారు మహేశ్‌బాబు. తాజాగా మరో హాలిడే ట్రిప్‌ను ప్లాన్‌ చేసుకున్నట్లున్నారు. భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, సితారలతో కలిసి మహేశ్‌బాబు శుక్రవారం విదేశాలకు పయనమయ్యారు. హ్యాపీగా.. జాలీగా యూరప్‌ వెళ్లారని తెలిసింది. కాగా ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి మహేశ్‌బాబు మూడోసారి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణను ఈ నెలాఖర్లో ప్లాన్‌ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ షెడ్యూల్‌ వాయిదా పడటంతో మహేశ్‌ హాలిడే ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నారని సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement