
వచ్చే 2 నెలలు బాబు విదేశాల్లో బిజీ బిజీ
వచ్చే నెలలో అమెరికా.. డిసెంబర్‌లో దక్షిణ కొరియాలో పర్యటన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రెండు నెలలు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో భాగంగా విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 13 నుంచి 20వ తేదీ వరకు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు.
అక్కడ జరిగే వివిధ పారిశ్రామిక సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు.