పేదలకు అండగా ఉంటాం
Published Tue, Aug 2 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటాం
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
కేఎల్ రావు కాలనీ (తాడేపల్లిరూరల్) : నిరంతరం పేద ప్రజలకు వైఎస్సార్‌సీపీ అండదండగా ఉంటుందని, ప్రభుత్వం పేదలపై చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అడ్డుకుని అండగా నిలబడతుందని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేఎల్ రావు కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితుల తరఫున కోర్టును ఆశ్రయించిన ఆర్కే సోమవారం కోర్టు ఇచ్చిన స్టేటస్ కో కాపీలను వారికి అందజేసేందుకు కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబునాయుడు తన ప్రతాపాన్ని పేదప్రజల గుడిసెలపై చూపిస్తున్నారని, ఆయనకు పేదలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. పేదల జోలికి వస్తే జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో బాబు చేసే కుట్రలను అడ్డుకుని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. లేదంటే ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగపూర్, జపాన్ కంపెనీలలో బినామీ అయిన నీ కొడుకును ఆర్థికంగా బలపరిచేందుకు పేదవాడి ప్రాణాలు పణంగా పెడితే భవిష్యత్తులో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆర్కే వ్యాఖ్యానించారు. పేదల పక్షాన నిలబడే వైఎస్సార్ సీపీని అణగదొక్కేందుకే దివంగత నేత వైఎస్ విగ్రహాలు తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వైఎస్ ఎప్పుడూ పేదల ప్రజల గుండెల్లోనే ఉంటాడనే విషయం చంద్రబాబునాయుడు గమనించాలని ఆర్కే అన్నారు.
Advertisement
Advertisement