
సాక్షి, మంగళగిరి : గత ప్రభుత్వంలో ముచ్చటగా మూడు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు వారికి పరామర్శించాలన్న బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు సంధించారు. వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు హైదరాబాద్ పారిపోతారా అంటూ ఆర్కే మండిపడ్డారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు వరదలను రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమా... మైలవరం నియోజకవర్గాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎప్పుడైనా పర్యటించారా అని ఎమ్మెల్యే ఆర్కే వ‍్యాఖ్యలు చేశారు.