
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఓటర్ల జాబితాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముసాయిదా కంటే అదనంగా 12లక్షల పై చిలుకు ఓటర్లు కొత్తగా చేరారని తెలిపారు. కొత్త ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు పంపిస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారులకు ఈ జాబితాను పంపించామన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలిని జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.