సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది.
సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే
► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాం.
►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి
►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు.
► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు.
►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి.
►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు.
► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం.
►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది.
► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం.
►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది.
► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్‌ను నమోదు చేశాం.
►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము.
► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి.
► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం.
► 35వేల పీస్‌లు, ప్రతీ పీఎస్‌కు 897 ఉన్నారు.
►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం.
►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి.
► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి.
►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు.
► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు.
► సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు.
► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి.
► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది.
► ఎలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా.
►ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం.
► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి.
► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి.
►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు
► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment