
నూతన లోక్‌సభ సభ్యుల వివరాలు అందజేత
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో కలిసి గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు.
సాయంత్రం 4.30 గంటల సమయంలో సీఈసీ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్‌లు రాష్ట్రపతి ముర్మును కలిశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 73ను అనుసరించి సార్వత్రిక ఎన్నికల్లో 18వ లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యుల వివరాలతో కూడిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రతిని ఆమెకు అందజేశారని వివరించింది.