సాక్షి, న్యూఢిల్లీ: మద్యం సేవించిన వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేస్తుంటాయని, అందులో మద్యం పంపిణీ ప్రధానమైందని పిల్‌లో పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా దిద్దుబాటుకు అడ్డంకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఓటర్ల జాబితాలో తప్పుల దిద్దుబాటుకు అడ్డంకులు తొలగడం లేదు. ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 12న ప్రచురించిన తుది జాబితాలో సాంకేతిక లోపాలతో 1.16 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు పునరావృతమైన విషయం తెలిసిందే. ఈ పేర్లను ఇంతవరకు తొలగించలేకపోయారు. తుది జాబితాను ప్రకటించిన తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు జరపడానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో పునరావృతమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ గత నెల రెండో వారం చివరల్లో సీఈసీకి లేఖ రాశారు. సీఈసీ నుంచి ఇంతవరకు స్పందన లభించకపోవడంతో సీఈ ఓ కార్యాలయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఓటు హక్కు పొందని వారి నుంచి ఈ నెల 9 వరకు స్వీకరించనున్న దరఖాస్తులను పరిష్కరించి 20 నాటికి రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు కసరత్తు జరుగుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే..
తుది జాబితాలో పునరావృతమైన పేర్లను తొలగించి రెండో అనుబంధ జాబితాను ప్రచురిస్తామని రజత్ కుమార్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇందుకు సీఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయన మరోసారి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment