రాష్ట్రంలో ప్రజలందరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని, ఒకవేళ పేరు లేనట్లయితే ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది విజ్ఞప్తి చేశారు. ఓటరుగా చేరేందుకు ఇక కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని, ఆలోగా జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకుంటే.. వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, 15వ తేదీ తరువాత ఓటు లేదంటే ఏమి చేయలేమని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం ద్వివేది ఆదివారం రాత్రి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్లుగా చేరడానికి సమయం ఉందని, అయితే దరఖాస్తుల వెరిఫికేషన్‌కు పది రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఈ నెల 15లోగా పేరుందో లేదో చూసుకుని దరఖాస్తు చేసుకోమని కోరుతున్నట్లు ద్వివేది వివరించారు.
ఓటు ఉందో లేదో చూసుకోండి
Published Mon, Mar 11 2019 10:58 AM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement