సాక్షి, హైదరాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఓటర్లు.. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సూచించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఎన్నికలు జరనున్న పురపాలక సంస్థల పరిధిలోని సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో తమ పేరు రిజిస్టరై ఉందో లేదో పరిశీలించుకోవాలని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్ కోరారు.
ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు లేవని ఎన్నికల రోజు నిరాశకు గురికాకుండా ముందే జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే విజ్ఞప్తి చేస్తున్నామాని, తర్వాత పేర్లు చేర్చే అవకాశం ఉండదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాల ప్రాతిపదికనే మున్సిపల్ ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నందున ఆ జాబితాలు సరిచూసుకోవాలని సూచించారు. ఇప్పటికే మున్సిపల్ సంస్థలు వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి గత జూలై 16న ప్రచురించిన నేపథ్యంలో మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉన్నాయా లేదా ఓటర్లు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు.
జాబితాలో పేర్లుంటేనే..
వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్న వారే మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులని, ఫొటో ఓటరు కార్డు కలిగి ఉన్నంత మాత్రాన, ఇటీవలి ఎన్నికల్లో ఓటు వేసినంత మాత్రాన మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసే వీలుండదని వివరించారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాల్లో పేర్లుంటేనే ఓటేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎస్‌ఈసీ వెబ్‌పోర్టల్ (్టట్ఛఛి.జౌఠి.జీn)లో ఓటర్ పోర్టల్ మాడ్యూల్‌లో ఓటర్‌స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమ ఓటు స్టేటస్‌ను పరిశీలించుకోవచ్చు.
సంబంధిత అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో తమ పేర్లు ఉండేలా చూసుకోవచ్చు. ఛ్ఛిౌ.్ట్ఛ ్చnజ్చn్చ వెబ్‌సైట్ ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఏ ఓటరైనా తన ఓటు ఉందో లేదా తెలుసుకోవచ్చు. అసెంబ్లీ జాబితాల్లో పేర్లు లేనివారు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికార్లకు నిర్ణీత ఫార్మాట్‌లో తగిన పత్రాలు లేదా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చని ఎస్‌ఈసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment