
చండూరు: తమకు సమాచారం లేకుండానే ఓటరు జాబితాలో తమ పేర్లను తొలగించారని మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మున్సిపాలిటీ లకినేనిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన పలువురు బాధితులు గురువారం చండూరులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ ఉప ఎన్నికలో ఓట్లను వినియోగించుకునేలా ఓటర్ లిస్టులో పేర్లనైనా చేర్చండి.. లేదంటే తమకు డెత్ సర్టిఫికెట్ అయినా ఇప్పించాలని కోరారు. తాము గ్రామంలోనే నివసిస్తున్నా తమ పేర్లను ఓటరు జాబితా నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కారింగు శివలింగం, షేక్ ఖాసీంబీ, అలివేలు, దోమలపల్లి జంగయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment