
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న ఆరు స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను శనివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరు స్థానాల్లో 2,997 మంది మహిళలు, 2,329 మంది పురుషులు.. కలిపి మొత్తం 5,326 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీలు 3,223, జెడ్పీటీసీలు 325, మున్సిపల్ కౌన్సిలర్లు 1,544, కార్పొరేటర్లు 169, ఎక్స్‌అఫీషియో ఓటర్లు 65 మంది ఉన్నారు.
రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల అథారిటీల (12 సీట్లకు) మండలి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, ఆరు సీట్లు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన ఆదిలాబాద్, కరీంనగర్ (2 సీట్లు), మెదక్, నల్లగొండ, ఖమ్మం స్థానాలకు వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించి 12న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ స్థానాల్లో ఓటేయనున్న వారి వివరాలను పట్టికలో చూడవచ్చు..