ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి అనంతరం తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వక మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కోరుకుంటున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు.