మూడేళ్లకే ఓటు హక్కు | Mistakes In Voters List Regarding Telangana Muncipal Elections | Sakshi
Sakshi News home page

మూడేళ్లకే ఓటు హక్కు

Published Sat, Jan 4 2020 9:45 AM | Last Updated on Sat, Jan 4 2020 12:05 PM

Mistakes In Voters List Regarding Telangana Muncipal Elections - Sakshi

ఓటరు జాబితాలో చిన్నారి వివరాలు, ఓటు హక్కు వచ్చిన ఎల్‌కేజీ చదువుతున్న శ్రీనందిత

సాక్షి, కరీంనగర్‌ సిటీ: మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన ఓటరు ముసాయిదా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అర్హతున్న వారికి ఓటుహక్కు ఇవ్వని అధికారులు, కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలోని ఓ మూడేళ్ల చిన్నారిని ఓటరు ముసాయిదాలో చేర్చారు. కరీంనగర్‌లో ఓటర్‌ ఐడీ వైఓజే 8588352 నంబర్‌పై నందిత మెతుకు పేరిట నమోదు అయింది.

నందిత వయస్సు 35ఏళ్లుగా, ఇంటినంబర్‌ 5–6–434గా ప్రచురించారు. వీటిని చూసిన నందిత తండ్రి మెతుకు రమేశ్‌ అవాక్కయ్యాడు. తమకూతురు నందిత వయస్సు 3ఏళ్లని, ఎల్‌కేజీ చదువుతోందని తెలిపాడు. అధికారులు స్పందించి వెంటనే ఓటర్‌ లిస్ట్‌ నుంచి తమ కూతురుపేరు తొలగించాలని కోరాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement