స్థానిక ఎన్నికల్లో కాల్పులు..ఒకరు మృతి | West Bengal civic polls: TMC worker shot dead | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో కాల్పులు..ఒకరు మృతి

Published Sat, Apr 25 2015 10:02 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

West Bengal civic polls: TMC worker shot dead

కాట్వా(పశ్చిమబెంగాల్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా  స్థానిక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాట్వా మున్సిపాలిటీ 14వ వార్డులోని పోలింగ్ బూత్ ఎదుట తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) కి చెందిన కార్యకర్తని ప్రత్యర్థులు కాల్చి చంపారు. మృతుడు ఇంద్రజిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉండటమేకాకుండా గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాట్వా సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement