civic polls
-
షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్లో హసన్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు. చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత -
'125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించారు'
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన గుజరాత్ స్థానిక ఎన్నికల ఫలితాలతో కొత్త శకం ఆరంభం అయ్యిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. ఆమ్ అడ్మి పార్టీ (ఆప్)కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సూరత్ ప్రజలు 125 ఏళ్ల చరిత్ర ఉన్నకాంగ్రెస్‌ను ఓడించారని, ప్రజల భాగస్వామ్యంతో గుజరాత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తమ పార్టీ అభ్యర్థులు ఎంతో నిజాయితీతో, నిబద్ధతతో పని చేస్తారని మాటిస్తున్నట్లు తెలిపారు. తమకు ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రజలను నేరుగా కలిసేందుకు ఈనెల 26న సూరత్‌లో పర్యటిస్తామని కేజ్రివాల్ పేర్కొన్నారు. కాగా ఆదివారం గుజరాత్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరగగా, వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. అయితే 120 వార్డులు ఉన్నసూరత్ కార్పొరేషన్లో బీజేపీ 93 గెలవగా కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సూరత్‌లో 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. సూరత్‌లో పటేల్ సామాజిక వర్గానికి చెందిన పాటిదార్ అనామత్ ఆరాక్షన్ సమితి (పిఎఎఎస్) ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బహిష్కరించింది. దీనిని అవకాశంగా మరల్చుకున్న ఆప్..వారి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్లు ఇచ్చి కాంగ్రెస్‌ను ఢీ కొట్టింది. ఫలితంగా సూరత్‌లో ఆప్ అనూహ్య రీతిలో విజయం సాధించింది. మరోవైపు ఆప్ విజయంతో రాష్ట్ర బిజెపి చీఫ్ సిఆర్ పాటిల్ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే పాటిల్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (80 ఏళ్ల వృద్ధుడికి.. రూ.80 కోట్ల కరెంట్ బిల్లు) (ఆ ఆటో డ్రైవర్‌కు నెటిజన్లు ఫిదా : భారీ విరాళాలు) -
అనూహ్యం.. మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్ పాగా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచింది. ఈ ఎన్నికల్లో సూరత్ కార్పొరేషన్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. దీంతో ఆప్‌కు పంజాబ్, గోవా తర్వాత గుజరాత్లో బలపడే అవకాశం లభించింది. సూరత్ కార్పొరేషన్ ఫలితాలతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన సూరత్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సూరత్ కార్పొరేషన్లో మొత్తం వార్డులు 120 ఉండగా బీజేపీ 93 గెలవగా ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. ఈ ఫలితాలపై ఆమ్ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ పాలనను గుజరాత్‌కు అవసరమని పేర్కొంది. అయితే ఆరు కార్పొరేషన్లలో ఒక్క సూరత్ తప్పా మిగతా చోట ఆప్ బోణీ చేయకపోవడం గమనార్హం. మిగతా కార్పొరేషన్లలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ నిలిచింది. అవి కూడా చాలా తక్కువ సీట్లే. అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్, జామ్‌నగర్ కార్పొరేషన్లో 547 స్థానాల్లో 576 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 450 స్థానాలు సొంతం చేసుకోగా, కాంగ్రెస్ 58, ఆమ్ఆద్మీ పార్టీ 27, ఇతరులు 8 స్థానాలు సొంతం చేసుకున్నారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని లీకులు చదవండి: కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్: ఆ సీటు కమలం ఖాతాలోకి -
కమలం ఖాతాలో 14 కార్పొరేషన్లు
సాక్షి, లక్నో: యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అత్యధిక కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో ఆ పార్టీ పాగా వేసింది. రాష్ట్రంలోని 16 మేయర్ స్థానాలకు గాను బీజేపీ 14 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ రెండు మేయర్ స్థానాలను గెలుచుకుంది. వారణాసి, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, రాయ్‌బరేలి, ఆగ్రా,ఫిరోజాబాద్, అయోధ్య, మధుర, లక్నో, కాన్పూర్, సహరాన్పూర్, మొరదాబాద్, ఝాన్సీ, బరేలీల్లో బీజేపీ మేయర్ అభ్యర్థులు విజయం సాధించారు. అలీఘర్, మీరట్‌లో బీఎస్పీ మేయర్ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమన్నారు. అమేథి, రాయ్‌బరేలి వంటి కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. -
‘అభివృద్థికి పట్టం కట్టారు’
సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ప్రజలకు తమపై ఉన్న విశ్వాసానికి సంకేతమని సీఎం యోగి ఆదిత్యానాథ అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు.బీజేపీకి అనుకూలంగా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు.అమేథి, బరేలీ వంటి కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని 16 మేయర్ స్థానాలకు గాను బీజేపీ 12 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ రెండు మేయర్ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. -
రాహుల్‌కు షాక్: అమేథిలో బీజేపీ విజయం
సాక్షి,లక్నో: కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీకి యూపీ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలసిందే. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆ పార్టీ కోల్పోయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోనూ బీజేపీ స్ధానిక పోరులో ఘనవిజయం సాధించింది. అమేథి నగర్ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది. -
ముస్లిం ఓటర్లకు బీజేపీ నేత బెదిరింపులు
సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ పార్టీ నేత రంజిత్ కుమార్ శ్రీవాస్తవ ముస్లింలను హెచ్చరించారు. బారాబంకి జిల్లాలో తన భార్య తరపును ప్రచారం చేస్తూ శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు దారా సింగ్ చౌహాన్, రమాపతి శాస్ర్తిల సమక్షంలోనే ఆయన ముస్లింలను బెదిరింపులకు లోను చేసేలా మాట్లాడారు. నవంబర్ 13న బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది. అభివృద్ధి జరగాలంటే బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలని, లేదంటే అభివృద్ధి గురించి మరిచిపోవాలని కూడా శ్రీవాస్తవ పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయాలని తాను అభ్యర్థించడం లేదని, తమ పార్టీకి ఓటేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు.కాగా, తన ప్రసంగం పెనుదుమారం రేపడంతో శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ బెదిరించలేదని, బీజేపీకి ముస్లింలు ఓటు వేసేలా ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. హిందువులు, ముస్లింల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయని వీటికి ముగింపు పలకాలని తాను కోరానన్నారు. -
మహరాష్ట్ర స్థానిక సంస్థల పోలింగ్ ప్రారంభం
-
స్థానిక ఎన్నికల్లో కాల్పులు..ఒకరు మృతి
కాట్వా(పశ్చిమబెంగాల్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాట్వా మున్సిపాలిటీ 14వ వార్డులోని పోలింగ్ బూత్ ఎదుట తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) కి చెందిన కార్యకర్తని ప్రత్యర్థులు కాల్చి చంపారు. మృతుడు ఇంద్రజిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉండటమేకాకుండా గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాట్వా సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు. -
స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా
రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న బీజేపీ.. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కనబర్చింది. మొత్తం 46 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా, 27చోట్ల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజధాని జైపూర్ కార్పొరేషన్లో మొత్తం 91 వార్డులుండగా, వాటిలో 64 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచాఉ. కాంగ్రెస్ కేవలం 18 చోట్ల మాత్రమే గెలవగా, మిగిలిన స్థానాలు స్వతంత్రులకు దక్కాయి. జోధ్‌పూర్‌లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ పాగా వేసింది. 65 వార్డులకు గాను 39 చోట్ల బీజేపీ గెలిచింది. ఉదయ్‌పూర్‌లో వరుసగా ఐదోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ 55 స్థానాలకు గాను కమలం ఖాతాలో 49 పడ్డాయి. కోట కార్పొరేషన్లో 65కు గాను 53 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. భరత్‌పూర్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ మొత్తం 50 వార్డులకు గాను స్వతంత్రులకు 20, బీజేపీకి 18, కాంగ్రెస్‌కు 11 దక్కాయి. ఈ ఎన్నికల్లో తమకు విజయం కట్టబెట్టిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సచిన్ పైలట్ చెప్పారు.