రాజస్థాన్లో అధికారంలో ఉన్న బీజేపీ.. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో హవా కనబర్చింది. మొత్తం 46 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా, 27చోట్ల బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. రాజధాని జైపూర్ కార్పొరేషన్లో మొత్తం 91 వార్డులుండగా, వాటిలో 64 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచాఉ. కాంగ్రెస్ కేవలం 18 చోట్ల మాత్రమే గెలవగా, మిగిలిన స్థానాలు స్వతంత్రులకు దక్కాయి. జోధ్పూర్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ పాగా వేసింది. 65 వార్డులకు గాను 39 చోట్ల బీజేపీ గెలిచింది.
ఉదయ్పూర్లో వరుసగా ఐదోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ 55 స్థానాలకు గాను కమలం ఖాతాలో 49 పడ్డాయి. కోట కార్పొరేషన్లో 65కు గాను 53 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. భరత్పూర్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ మొత్తం 50 వార్డులకు గాను స్వతంత్రులకు 20, బీజేపీకి 18, కాంగ్రెస్కు 11 దక్కాయి. ఈ ఎన్నికల్లో తమకు విజయం కట్టబెట్టిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సచిన్ పైలట్ చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా
Published Tue, Nov 25 2014 7:32 PM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM
Advertisement
Advertisement