
సాక్షి,లక్నో: కాంగ్రెస్ చీఫ్ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీకి యూపీ స్ధానిక ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథి నగర పంచాయితీలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. వేయికి పైగా ఓట్ల తేడాతో బీజేపీ అమేథిలో గెలుపొందింది. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలసిందే. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఈ నియోజకవర్గానికి పేరుంది.
ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి పరిధిలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లనూ ఆ పార్టీ కోల్పోయింది. అమేథితో పాటు సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలీలోనూ బీజేపీ స్ధానిక పోరులో ఘనవిజయం సాధించింది.
అమేథి నగర్ పంచాయితీలో బీజేపీ అభ్యర్థి చంద్రమా దేవి 1035 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యూపీ స్ధానిక ఎన్నికల్లో అత్యధిక మేయర్ స్ధానాలను, నగర పంచాయితీలను బీజేపీ కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment