సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆ పార్టీ నేత రంజిత్ కుమార్ శ్రీవాస్తవ ముస్లింలను హెచ్చరించారు. బారాబంకి జిల్లాలో తన భార్య తరపును ప్రచారం చేస్తూ శ్రీవాస్తవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు దారా సింగ్ చౌహాన్, రమాపతి శాస్ర్తిల సమక్షంలోనే ఆయన ముస్లింలను బెదిరింపులకు లోను చేసేలా మాట్లాడారు. నవంబర్ 13న బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో కలకలం రేపుతోంది.
అభివృద్ధి జరగాలంటే బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోవాలని, లేదంటే అభివృద్ధి గురించి మరిచిపోవాలని కూడా శ్రీవాస్తవ పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేయాలని తాను అభ్యర్థించడం లేదని, తమ పార్టీకి ఓటేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు.కాగా, తన ప్రసంగం పెనుదుమారం రేపడంతో శ్రీవాస్తవ వివరణ ఇచ్చారు.
తాను ఎవరినీ బెదిరించలేదని, బీజేపీకి ముస్లింలు ఓటు వేసేలా ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. హిందువులు, ముస్లింల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయని వీటికి ముగింపు పలకాలని తాను కోరానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment